https://oktelugu.com/

Fraud: మోసగాళ్లు మరీ ఎక్కువ అప్డేట్ అయ్యారు? అమాయకులు పని అంతే..

ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని సార్లు మోసం పోవడం కామన్ గా జరుగుతుంది. అమాయకంగా కనిపించే వారి దగ్గర, తప్పుడు వస్తువులు అమ్మి డబ్బులు వసూలు చేసే వారు ఎక్కువే ఉన్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 13, 2024 / 06:23 PM IST

    Fraud

    Follow us on

    Fraud: కాలం మారింది. కాలంతో మనుషుల ప్రవర్తన, ఆలోచన, జాగ్రత్తలు అన్నీ కూడా మారాయి. చిన్న విషయాన్ని అయినా నమ్మే మనుషులు.. ఇప్పుడు ఎంత పెద్ద విషయాన్ని అయినా చెక్ చేసుకున్న తర్వాతనే నమ్ముతున్నారు. ఇక వస్తువుల విషయంలో అయితే ఈ జాగ్రత్త మరింత ఎక్కువే ఉంటుంది. ఏదైనా వస్తువు కొనాలంటే ఆ వస్తువు ధర, లేదంటే ఇతర షాప్ లో, ఇతర సైట్ లలో ఎలాంటి ధర ఉంది అని తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఏ వస్తువు అయినా సరే ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకొని మరీ కొంటున్నారు.

    ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని సార్లు మోసం పోవడం కామన్ గా జరుగుతుంది. అమాయకంగా కనిపించే వారి దగ్గర, తప్పుడు వస్తువులు అమ్మి డబ్బులు వసూలు చేసే వారు ఎక్కువే ఉన్నారు. రీసెంట్ గా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఓ మహిళ పోలీసు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఇందులో ఆ మహిళ 700 రూపాయలకే ఒక పవర్ బ్యాంక్ కొనుగోలు చేసింది.

    పవర్ బ్యాంక్ ను ట్రైన్ లో కొనుగోలు చేసిందట. ఇంటికి వచ్చాక ఆ పవర్ బ్యాంక్ ఓపెన్ చేస్తే అందులో రెండు బ్యాటరీలు ఉన్నట్టు కనిపించేలా బలంగా ఉండడానికి ఇసుకతో ఒక మౌల్డ్ లాంటిది తయారు చేసి పెట్టి చూపించారట. 700 రూపాయలు పెట్టి కొన్న పవర్ బ్యాంక్ లోపల ఇలా ఉంది అని వారు చేసిన మొసాన్ని చెప్పింది మహిళ.

    ఆ పవర్ బ్యాంక్ లు కొన్ని ఎంత మంది మోసపోయారో అంటూ ఆవేదన చెందింది. కాలం మారుతున్నా టెక్నాలజీ పెరుగుతున్నా మోసం చేసే వారి నక్కజిత్తుల ఆలోచనలు మాత్రం మారడం లేదు. వారి మాయ మాటలతో వస్తువులు అమ్మే వాళ్ళు ఎంతో మందిని మోసం చేస్తున్నారు. ఎక్కువ ధరకు వస్తువు అమ్మడం లేదా ఆ వస్తువుకు బదులు మరో వస్తువును అమ్మడం వంటివి చేస్తున్నారు. మరి జాగ్రత్త సుమ.