https://oktelugu.com/

Lavanya Tripathi: వరుణ్ వైఫ్ లావణ్య త్రిపాఠికి జరిగిన ప్రమాదం ఏమిటీ? స్కాన్ చేసిన డాక్టర్స్ ఏం చెప్పారంటే?

స్టెప్స్ దిగుతుండగా ఆమె కాలు జారి పడిపోయిందట. దీంతో కాలికి చిన్న దెబ్బ తగిలిందట. అప్పుడు పెద్దగా నొప్పి లేకపోవడంతో పట్టించుకోలేదట.

Written By:
  • S Reddy
  • , Updated On : June 13, 2024 / 06:15 PM IST

    Lavanya Tripathi

    Follow us on

    Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. సదరు ఫోటో ఆమె అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేసింది. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ లావణ్య త్రిపాఠి ఏం పోస్ట్ వేశారంటే .. ఆమె తన కాలికి గాయం అయినట్లు తెలిపారు. గాయం కారణంగా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారట. కొన్ని రోజుల క్రితం లావణ్య త్రిపాఠికి ప్రమాదానికి గురైందట.

    స్టెప్స్ దిగుతుండగా ఆమె కాలు జారి పడిపోయిందట. దీంతో కాలికి చిన్న దెబ్బ తగిలిందట. అప్పుడు పెద్దగా నొప్పి లేకపోవడంతో పట్టించుకోలేదట. రోజులు గడిచే కొద్దీ నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించారట. స్కాన్ చేసిన వైద్యులు యాంకిల్ ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారట. గాయం మానే వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. బెడ్ రెస్ట్ తీసుకుంటున్న లావణ్య త్రిపాఠి … పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేక పోయింది. జూన్ 12న జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ నుండి పలువురు పాల్గొన్నారు. కాగా లావణ్య వివాహం తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

    వరుణ్ తేజ్ – లావణ్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీలో గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. లావణ్య పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ ను చక్కగా బ్యాలన్స్ చేస్తుంది. ఇటీవల వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

    ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సైతం నిరాశ పరిచింది. మంచి హిట్ కొట్టి కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నాడు. సోలో హిట్ అందుకుని దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ప్రస్తుతం ఆయన కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.