https://oktelugu.com/

Trivikram Srinivas : హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మీద దృష్టి పెట్టిన త్రివిక్రమ్…గురూజీ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా..?

చాలా మంది దర్శకులకు ఇండస్ట్రీ లో ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ కొంతమంది కి మాత్రం ఇక్కడ సెపరేట్ గుర్తింపు అయితే ఉంటుంది. అందులో త్రివిక్రమ్ ఒకరు...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 08:32 PM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas : ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు టాలెంటెడ్ డైరెక్టర్స్ గా గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో తమను మించిన దర్శకులు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను అయితే సంపాదించుకున్నారు. ఇక అలాంటి వారిలో కొందరు ప్రస్తుతం ఫెయిడ్ అవుట్ దశకు దగ్గరలో ఉంటే మరి కొందరు మాత్రం ఫేడౌట్ అయిపోయి సినిమాలను చేయకుండా దూరంగా ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట రైటర్ గా రాణించి ఆ తర్వాత దర్శకుడి గా మారి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేసిన విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. అలాగే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించి పెట్టడంలో ఆయన చాలావరకు ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో చేసి మూడు వరుస సక్సెస్ లను అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమాతో ఢీలా పడ్డాడు. ఇక ఒక ప్లాప్ తోనే త్రివిక్రమ్ పేరు ఇండస్ట్రీలో వినిపించకుండా పోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి ఒక సందర్భంలో గురూజీ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడనే విషయం మీదనే సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.

    మరి తను అనుకున్నట్టుగానే మరోసారి భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈయన సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మడు ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు.

    కానీ స్టార్ హీరోలు ఎవరు ప్రస్తుతం డేట్స్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకే కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతను అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఇకమీదట రాబోయే సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…