Mathu Vadalara 2 : మత్తు వదలరా 2′ మొట్టమొదటి రివ్యూ.. సత్య కామెడీ ఒక రేంజ్ లో పేలిందట!

ఈ సినిమాలో సునీల్ చాలా సీరియస్ పాత్ర పోషించాడని, ఆ సీరియస్ పాత్ర నుండి కూడా డైరెక్టర్ రితేష్ రానా కామెడీ పిండుకున్నాడని అంటున్నారు. ఫస్ట్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగానే నడిపించాడు కానీ, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా ఆడియన్స్ గందరగోళానికి గురయ్యే సన్నివేశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది

Written By: Vicky, Updated On : September 9, 2024 8:35 pm

Mathu Vadalara 2

Follow us on

Mathu Vadalara 2 : విభిన్నమైన కామెడీ టైమింగ్ తో సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే దర్శకుడిగా రితేష్ రానా కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు ఆయన ‘మత్తు వదలరా’ మరియు ‘హ్యాపీ బర్త్డే’ వంటి సినిమాలు చేసాడు. వీటిలో మత్తు వదలరా చిత్రం పెద్ద హిట్ అయ్యింది. కీరవాణి కొడుకు శ్రీ సింహా ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయ్యాడు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చక్కటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల చేత కితకితలు పెట్టించాడు డైరెక్టర్ రితేష్ రానా. ఇప్పుడు ఇదే దర్శకుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2 ‘ ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రెబెల్ స్టార్ ప్రభాస్ చేత విన్నూతనమైన రీతిలో ఇటీవలే లాంచ్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ వీడియో సోషల్ మీడియా లో నిన్నటి నుండి తెగ ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని నేడు కాసేపటి క్రితమే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా షో వేసి చూపించారట. ఆ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా పార్ట్ 1 కి కొనసాగింపుగానే ఉంటుందట, ఆ సినిమా వేరు, ఈ సినిమా అనే విధంగా ఉండదట. డైరెక్టర్ రితేష్ రానా కమెడియన్ సత్య లోని కామెడీ టైమింగ్ ని బాగా వాడుకున్నాడట. ట్రైలర్ లో కూడా సత్య కామెడీ ని బాగా హైలైట్ చేసి చూపించారు. ఇక వెన్నెల కిషోర్ వెరైటీ క్యారక్టర్ ఆడియన్స్ కి పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుందని టాక్. అలాగే ఈ సినిమాలో సునీల్ చాలా సీరియస్ పాత్ర పోషించాడని, ఆ సీరియస్ పాత్ర నుండి కూడా డైరెక్టర్ రితేష్ రానా కామెడీ పిండుకున్నాడని అంటున్నారు. ఫస్ట్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగానే నడిపించాడు కానీ, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా ఆడియన్స్ గందరగోళానికి గురయ్యే సన్నివేశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

వీటిని ఎడిటింగ్ లో తీసేయడం వల్ల సినిమాకి మంచి పాజిటివ్ అవుతుందని పలువురు ప్రముఖులు డైరెక్టర్ కి సలహా ఇచ్చారు. ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ కి ఒక మంచి టైం పాస్ అయ్యే విధంగా ఉంటుందని, కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సెప్టెంబర్ 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కి ప్రభాస్ ప్రొమోషన్స్ చేయడం బాగా కలిసిసొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఇదే తరహా టాక్ ని తెచుకుంటుందా లేదా అనేది.