Bigg Boss Telugu 8 : 14 మంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు 13 మందికి చేరింది. గత వారం జరిగిన నామినేషన్స్ లో బెజవాడ బెబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా హీట్ వాతావరణం లో జరిగింది అనేది ఈరోజు విడుదలైన ప్రోమోలను చూస్తే అర్థం అవుతుంది. మధ్యలో ఒక లవ్ ప్రోమో ని కూడా వదిలాడు బిగ్ బాస్. సోనియా మరియు నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా రెండవ ప్రోమో ని కట్ చేసారు. ‘సిగరెట్ మానెయ్..నువ్వు ఏమి అడిగితే అది ఇస్తాను’ అంటూ సోనియా మాట్లాడిన మాటలకు నిఖిల్ షాక్ కి గురి అవుతాడు. చూస్తుంటే వీళ్ళ మధ్య ట్రాక్ వేరే లెవెల్ కి వెళ్లేట్టుగా అనిపిస్తుంది. ఇక మూడవ ప్రోమో లో నామినేషన్స్ చాలా హీట్ వాతావరణంలో నడిచినట్టుగా అనిపించింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ లో ఆదిత్య ఓం కూడా తన మాస్కు ని విప్పేసి అగ్రెస్సివ్ గా మారాడు అని అనిపించింది. అంతే కాకుండా తనతో స్నేహం చేసిన శేఖర్ బాషా ని నామినేట్ చేసాడు. వీళ్ళ మధ్య చాలా హీటెడ్ చర్చలు నడిచాయి. అలాగే ఈ నామినేషన్స్ లో సోనియా మరియు సీత మధ్య కూడా వాదనలు బలంగా నడిచాయి. ఇక నాగ మణికంఠ సోది ఎప్పుడూ ఉండేదే. ఎప్పటిలాగానే ఆయన ఎమోషనల్ అవుతూ ఆదిత్య ఓం మరియు శేఖర్ బాషా ని నామినేట్ చేసాడు.
అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినవాళ్లు ఏకంగా 8 మంది ఉన్నారట. ఆ 8 మంది ఎవరంటే నాగ మణికంఠ , శేఖర్ బాషా, ఆదిత్య ఓం, నైనిక, నిఖిల్, విష్ణు ప్రియా, సీత మరియు పృథ్వీ రాజ్. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నిఖిల్ కొనసాగుతుండగా, రెండవ స్థానంలో విష్ణు ప్రియా కొనసాగుతుంది.ఇక టాస్కులలో చురుకుదనం చూపించే నైనిక మూడవ స్థానంలో నిలబడగా, తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే శేఖర్ బాషా నాల్గవ స్థానం లో కొనసాగుతున్నాడు. అయితే వీరిలో అందరికంటే చివరి స్థానంలో కిరాక్ సీత ఉంది.
ఈమె ఆట ఇంకా ప్రేక్షకులు చూడలేదు, కానీ మంచి అమ్మాయి, సరైన పాయింట్స్ తో మాట్లాడుతుంది అనే పేరుని మాత్రం తెచ్చుకుంది. అలాంటి అమ్మాయి ఎలిమినేట్ అవ్వబోతుంది అనే వార్త ఇప్పుడు ప్రేక్షకులను కాస్త బాధకు గురి చేస్తుంది. అయితే ఈమెకి ఆదిత్య ఓం కి మరియు పృథ్వి రాజ్ కి ఓట్లలో భారీ తేడా ఏమి లేదు. ముగ్గురుకి దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ ఉంది, వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు, ప్రస్తుతానికి ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే.