https://oktelugu.com/

Trisha Krishnan: నా జీవితంలోనే అత్యంత కష్టమైన సినిమా వర్షం.. ప్రభాస్ తో చేయడంపై బాంబు పేల్చిన త్రిష

త్రిష-ప్రభాస్ కాంబోలో వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ హిట్. త్రిష కెరీర్ కి పునాది వేసిన చిత్రం అది. అయితే ఆ మూవీ తన కెరీర్లో అత్యంత కష్టమైన చిత్రమని త్రిష చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ చిత్రాన్ని ఆమె ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇంతకీ ఆమె ఏమన్నారు?

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 2, 2024 / 12:41 PM IST

    Trisha Krishnan

    Follow us on

    Trisha Krishnan: తెలుగులో త్రిష చేసిన మొదటి చిత్రం నీ మనసు నాకు తెలుసు. తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఆశించిన స్థాయిలో ఆడలేదు. దర్శకుడు శోభన్ త్రిషకు వర్షం మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అప్పటికి ప్రభాస్ కి ఇంకా స్టార్డం రాలేదు. త్రిష సైతం అప్పుడప్పుడే ఎదుగుతుంది. 2004 సంక్రాంతి కానుకగా వర్షం మూవీ విడుదలైంది. మరోవైపు బాలకృష్ణ, చిరంజీవి సంక్రాంతి బరిలో ఉన్నారు. లక్ష్మీ నరసింహ, అంజి చిత్రాలు పోటా పోటీగా విడులయ్యాయి.

    అనూహ్యంగా వర్షం సంక్రాంతి విన్నర్ అయ్యింది. అంజి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. లక్ష్మి నరసింహ హిట్. వర్షం మూవీ బ్లాక్ బస్టర్. బడా స్టార్స్ బరిలో ఉన్న నేపథ్యంలో వర్షం వాయిదా వేద్దామని అనుకున్నారట. ధైర్యం చేసి విడుదల చేసినందుకు సినిమా మంచి విజయం అందుకుంది. త్రిష, ప్రభాస్ ల కెరీర్లో ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు.

    అయితే వర్షం మూవీ షూటింగ్ లో తాను చాలా ఇబ్బంది పడినట్లు త్రిష చెప్పారు. అనేక సన్నివేశాల్లో ఆమె తడుస్తూ నటించాల్సి వచ్చిందట. తన కెరీర్లో వర్షం కఠినమైన చిత్రం అని త్రిష అన్నారు. త్రిష కష్టానికి ఫలితం దక్కిందని చెప్పాలి. వర్షం అనంతరం త్రిష నటించిన నువ్వొస్తానంటే నేను వద్దంటానా, అతడు చిత్రాలు విజయం సాధించాయి. త్రిష తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా జెండా పాతింది. స్టార్స్ తో జతకట్టింది.

    కాగా ప్రభాస్-త్రిష పౌర్ణమి మూవీలో మరోసారి జతకట్టారు. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. రెండు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉన్న త్రిష ఇప్పటికీ స్టార్స్ చిత్రాల్లో ఆఫర్స్ పట్టేస్తూ సత్తా చాటుతుంది. విశ్వంభర మూవీలో చిరంజీవికి జంటగా ఆమె నటిస్తున్నారు. విశ్వంభర సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత చిరంజీవి-త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గతంలో వీరిద్దరూ స్టాలిన్ మూవీలో జతకట్టారు.