టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి మన దేశ కీర్తిన ప్రపంచానికి చాటిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఇండియా.. ఇండియా భారత్ మాతాకీ జై, వందేమాతరం వంటి నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.