https://oktelugu.com/

Toxic Teaser: కెజిఎఫ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ టాక్సిక్ టీజర్ రివ్యూ… మైండ్ బ్లాక్ చేస్తున్న లుక్!

దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారు. యష్ కి కన్నడలో తప్పితే బయట మార్కెట్ లేదు. అయితే సబ్జెక్టు ని నమ్మి కెజిఎఫ్ ని కన్నడతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేశారు. కన్నడకు మించిన ఆదరణ ఇతర భాషల్లో కెజిఎఫ్ కి దక్కింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2023 / 03:52 PM IST

    Toxic Teaser

    Follow us on

    Toxic Teaser: ఆల్ ఇండియాలో యష్ అంటే తెలియని మూవీ లవర్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కెజిఎఫ్ సిరీస్ తో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. కెజిఎఫ్ మూవీ 2018లో విడుదల కాగా, ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారు. యష్ కి కన్నడలో తప్పితే బయట మార్కెట్ లేదు. అయితే సబ్జెక్టు ని నమ్మి కెజిఎఫ్ ని కన్నడతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేశారు. కన్నడకు మించిన ఆదరణ ఇతర భాషల్లో కెజిఎఫ్ కి దక్కింది.

    ఇక దానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టింది. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. హైయెస్ట్ గ్రాసర్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో చేరింది. కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యష్ ఇమేజ్ హద్దులు దాటేసింది. కెజిఎఫ్ 2 విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది. అయినా యష్ మరో చిత్రం ప్రకటించలేదు.

    దీంతో ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా యష్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాలి అంటూ తమ డిమాండ్ వినిపించారు. మంచి సబ్జెక్టు ఎంచుకుని మిమ్మల్ని సంతృప్తి పరిచే చిత్రం చేయాలనేదే నా తపన. అందుకే ఆలస్యం అని యష్ ఫ్యాన్స్ కి నచ్చజెప్పాడు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరిక తీరింది. యష్ నూతన చిత్ర ప్రకటన చేశారు.

    యష్ 19వ చిత్రానికి టాక్సిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ లోగో తో పాటు యష్ ప్రీ లుక్ తో కూడిన టీజర్ విడుదల చేశారు. టైటిల్ తో పాటు యష్ లుక్ గూస్ బంప్స్ కలిగించే విధంగా ఉన్నాయి. చేతిలో గన్, నోట్లో సిగార్, హ్యాట్-కోట్ ధరించి యష్ వింటేజ్ గ్యాంగ్ స్టర్ గా దర్శనం ఇచ్చాడు. ఆ లుక్ చూస్తే టాక్సిక్ కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తంగా టైటిల్ యష్ ఇమేజ్ కి తగ్గట్లు మాస్ వైబ్రేషన్ కలిగి ఉంది.