https://oktelugu.com/

Maruti Swift 2024: మార్కెట్లోకి కొత్త మారుతి స్విఫ్ట్ … మైలేజ్ చూస్తే మతిపోతుంది..!

మారుతి స్విప్ట్ ను కొత్త మోడల్ ను ‘న్యూజెన్ మారుతి సుజుకీ స్విప్ట్’ పేరుతో మార్కెట్లోకి రానుంది. 2024లో దీనిని లాంచ్ చేయనున్నారు. దీని ఇంటీరియర్ డిజైన్ ను పరిశీలిస్తే 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, స్టార్ట్ స్టాప్ బటన్, 360 డిగ్రీ కెమెరా ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 8, 2023 / 03:47 PM IST

    Maruti Swift 2024

    Follow us on

    Maruti Swift 2024: ఆటోమోబైల్ రంగంలో మారుతి సుజుకి ప్రత్యకత చాటుకుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ హాట్ ఫేవరేట్ గా మారి అత్యధిక అమ్మకాలు జరిగాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా వారిని ఆకర్షించే విధంగా పాత మోడళ్లను అప్డేట్ చేస్తూ ఇప్పటి వారికి నచ్చే విధంగా తయారు చేస్తున్నారు. మారుతి స్విఫ్ట్ నెక్స్ట్ జెన్ పేరుతో మార్కెట్ లోకి రాబోతుంది. అధునాతన ఫీచర్స్ తో పాటు అప్డేట్ వెర్షన్ కలిగిన ఇంజిన్ ను కలిగి ఉంది. భారత్ లో ఎన్నో కార్ల కంపెనీలు వివిధ మోడళ్లను ప్రవేశ పెడుతున్నప్పటికీ మారుతి కార్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మరి 2024 స్విప్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం..

    మారుతి స్విప్ట్ ను కొత్త మోడల్ ను ‘న్యూజెన్ మారుతి సుజుకీ స్విప్ట్’ పేరుతో మార్కెట్లోకి రానుంది. 2024లో దీనిని లాంచ్ చేయనున్నారు. దీని ఇంటీరియర్ డిజైన్ ను పరిశీలిస్తే 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, స్టార్ట్ స్టాప్ బటన్, 360 డిగ్రీ కెమెరా ఉంది. అలాగే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఆకర్షిస్తుంది. కొత్త స్విప్ట్ ముందు భాగంలో ఎల్ ఈడీ లైట్స్, క్లాంప్ షెల్ హుడ్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తున్నాయి.

    కొత్త రకమైన మారుతి మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో స్విప్ట్ XG, హైబ్రిడ్ MX, హైబ్రిడ్ MZ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మోడల్ 1.2 లీటర్ 3 సిలండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. 80 బీహెచ్ పీ పవర్ తో పాటు 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఆఇది 5 స్పీడ్ మాన్యువల్, సీవీటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇంజిన్ ఆప్షన్లతో ఉంది. ప్రస్తుతం దీని మైలేజ్ ను లీటర్ కు 35 నుంచి 40 కిలోమీటర్లు ఇచ్చే విధంగ సెట్ చేశారు.

    పాత తరం మారుతి 2018లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దాని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కొత్తతరం మోడల్ ను కూడా ఆదరిస్తారని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. మొత్తం 13 రంగుల్లో విడుదల చేస్తున్న ఇందులో ప్రాంటియర్ బ్లూ, కూల్ ఎల్లో, కారవాన్ ఐవరీ, ప్యూర్ వైట్, ప్రీమియం సిల్వర్, స్టార్ సిల్వర్, ప్లేమ్ ఆరేంజ్, సూపర్ బ్లాక్ కలర్లు ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్ విషయానికొస్తే ప్రాంటియర్ బ్లూ, బర్నింగ్ రెడ్, కూల్ ఎల్లో, ప్యూర్ వైట్ లో రానుంది.