Toxic Movie Director Geethu Mohan Dass: వచ్చే నెల 19న కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యాష్(Rocking Star Yash) నటించిన ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మొదటి టీజర్ తోనే ఈ చిత్రం పై తిరుగులేని బజ్ క్రియేట్ అయ్యింది. పైగా యాష్ KGF సిరీస్ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై తెలుగు లో కూడా వేరే లెవెల్ క్రేజ్ ఏర్పడింది. ఇంతటి భారీ సినిమాకు దర్శకత్వం వహించిన అమ్మాయి పేరు గీతూ మోహన్ దాస్(Geethu Mohan Dass). ఒక అమ్మాయి అయ్యుండి ఇంతటి వయొలెంట్ సినిమా ఎలా తీసిందిరా బాబు అంటూ సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇదంతా పక్కన పెడితే ఈ గీతూ మోహన్ దాస్ అనే అమ్మాయి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ఒకప్పుడు బాలనటి, తర్వాత పెద్దయ్యాక అనేక సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.
Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్
పూర్తి వివరాల్లోకి వెళ్తే గీతూ మోహన్ దాస్ తన బాల్యం లోనే మలయాళం లో ఎన్నో సినిమాల్లో బాలనటిగా నటించింది. మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో ఆమె అవార్డుని కూడా అందుకుంది. ఆ తర్వాత పెద్దయ్యాక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు ని కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి ‘లయర్స్ డైస్’ అనే చిత్రాన్ని తీసింది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత ‘మూతోన్ ‘ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ఈమె విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇదంతా పక్కన పెడితే తెలుగు లో ఈమె ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?.
2001 వ సంవత్సరం లో హీరో వేణు తొట్టెంపూడి ‘వీడెక్కడి మొగుడండీ’ అనే చిత్రం చేసాడు. ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా శృతి రాజ్ నటించగా, మరో హీరోయిన్ గా గీతూ మోహన్ దాస్ నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా, గీతూ కి సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు వరుసగా ఆఫర్లు వచ్చాయి . కానీ ఆమె మలయాళం లో కొనసాగడానికే ఎక్కువ గా ఆసక్తి చూపడంతో తెలుగులో సినిమాల పై ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అలాంటి గీతూ మోహన్ దాస్ ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్లు విలువ చేసే సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.