Homeఅంతర్జాతీయంMasood Azhar Spotted: మసూద్ అజర్ జాడ దొరికింది.. ఇక లేపేసుడే ఆలస్యం?

Masood Azhar Spotted: మసూద్ అజర్ జాడ దొరికింది.. ఇక లేపేసుడే ఆలస్యం?

Masood Azhar Spotted: తమది ఉగ్రవాద బాధిత దేశం అని పదే పదే చెప్పుకుంటూ ప్రపంచ దేశాల సానుభూతి పొందుతున్న పాకిస్తాన్‌.. ఉగ్రవాదులను తమ దేశంలనే ఉంచి కాపు కాస్తోంది. ఒసామా బిన్‌ లాడెన్‌, దావూద్‌ ఇబ్రహీం. మజూద్‌ అజర్‌ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోనే ఉన్నారు. వారిని కాపాడింది, కాపాడుతోంది పాకిస్తానే. ఉగ్రవాదాని పెంచి పోషిస్తోంది. అదే సమయంలో పామును పాలుపోసి పెంచిన చందంగా ఉగ్రదాడులకు గురవుతోంది. తాజాగా భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు జైష్‌ – ఏ – మహ్మద్‌ అధినేత, మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ మసూద్ అజర్ జాడ కనిపెట్టాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించాయి. బహవల్పూర్‌లోని తన సంప్రదాయ కంచుకోట నుంచి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో అతడు దాక్కున్నాడని తెలుస్తోంది. ఈ సమాచారం భారత భద్రతా వ్యవస్థలకు కీలక పురోగతి. మసూద్ ఆచూకీని గుర్తించడం ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు ముఖ్యమైన అడుగు.

ఇంటెలిజెన్స్ ట్రాకింగ్‌లో కదలికలు..
ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మసూద్ అజర్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అతడు పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఉన్నట్లు ధృవీకరించడంతో, భారత భద్రతా బలగాలు అతడి కార్యకలాపాలపై నిఘా ఉంచాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా సంక్లిష్టమైనది, ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలమైన పరిస్థితులను అందిస్తుంది. ఇది భద్రతా సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తుంది. అయినా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఆధునిక సాంకేతికత, వ్యూహాత్మక పర్యవేక్షణ మసూద్‌ను ట్రాక్ చేయడంలో సహాయపడుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 14 మందిని హతమార్చింది, ఈ ఆపరేషన్ భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చర్య జైష్‌ – ఏ – మహ్మద్ సంస్థపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చింది. నాడు మసూద్‌ అజర్‌ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడు మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. అయినప్పటికీ పీవోకేలోనే ఉన్నట్లు తాజాగా ఇంటెలిజెన్స్‌ సంస్థలు గుర్తించాయి.

Also Read: Balochistan: స్వాతంత్య్రానికి మరింత చేరువైన బలూచిస్తాన్‌.. లోంగుబాటలో పాకిస్తాన్‌ సైన్యం

పాస్‌ మోడ్‌లో ఆపరేషన్‌ సిందూ…
ఇదిలా ఉంటే ఆపరేషన్‌ సిందూర్‌ ప్రస్తుతం పాస్‌ మోడ్‌లో ఉంది. భారత్‌లో ఏ ఉగ్ర ఘటన జరిగినా దానికి పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అగ్రిమెంట్‌ మేరకు ఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ పాస్‌మోడ్‌లో పెట్టింది. ఈ తరుణంలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజర్‌ జాడ కనిపెట్టింది. ఆపరేషన్‌ సిందూర్‌ను యాక్టివ్‌ చేస్తే మసూద్‌ను మట్టి కరిపించే అవకాశం ఉంది. అందుకే పాకిస్తాన్‌ ప్రస్తుతం ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version