https://oktelugu.com/

Janhvi Kapoor: దేవర సినిమాతో జాన్వీ కపూర్ జాతకం మారబోతుందా..? ఒక్క సాంగ్ తోనే కుర్రాళ్లలో హీట్ పుట్టించిందా..?

సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే ఎక్కువగా క్రేజ్ ఉంటుందో వాళ్ళకే ఎక్కువ సక్సెస్ లు వస్తాయి...ఇక వాళ్ల సినిమాల కోసమే అభిమానులు అసక్తి గా ఎదురుచూస్తారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 6, 2024 / 10:53 AM IST

    Janhvi Kapoor

    Follow us on

    Janhvi Kapoor: కొంతమంది దర్శకులు సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా మాత్రమే వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం హీరోయిన్లకు కూడా చాలా ప్రత్యేకత ఉండే విధంగా క్యారెక్టర్ ను రాసుకొని వాళ్ల చేత పర్ఫాం చేయిస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటీమణులు మంచి పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్లకు సరైన క్యారెక్టర్లు మాత్రం దొరకవు. ఇలాంటి సందర్భంలో వాళ్లు ఏం చేయాలో తెలియక వచ్చిన ఆఫర్స్ ని ఒప్పుకుంటూ సినిమాలు చేస్తూ వాళ్ళ ఐడెంటిటీని కోల్పోతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందాల తార గా గుర్తింపు పొందిన శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన పాత్ర మాత్రం ఏది లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆమె రొటీన్ మూస ధోరణి లో సాగిన పాత్రలను మాత్రమే చేసింది. తప్ప వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడంలో తను విఫలమైంది. ఇక దర్శకులు కూడా ఆమెకు ఎప్పుడూ అలాంటి పాత్రలనే ఇచ్చారు తప్ప మంచి క్యారెక్టర్స్ ను ఇచ్చి ఆమెలో ఉన్న నటిని బయటికి తీయడంలో ఫెయిల్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఆమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాబట్టి ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొస్తుంది.

    Also Read: దేవర సాంగ్ ఇలా ఉందేంటి..? అనిరుధ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు…

    అంటూ మొదటి నుంచి ఆమె మంచి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక అందుకు తగ్గట్టుగానే నిన్న ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ కొన్ని గంటల్లోనే భారీ రికార్డు లను క్రియేట్ చేస్తూ కొన్ని మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇక అలాగే రొమాంటిక్ సాంగ్ లో జాన్వీ కపూర్ అందాలను చూసిన కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. ఇన్ని రోజులు ఈ అందాన్ని బాలీవుడ్ మీడియా ఎందుకు ఎక్స్పోజ్ చేయలేక పోయింది. అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

    నిజానికి కొరటాల శివ ఆ అమ్మాయిని చాలా అందంగా చూపించారు. అలాగే సినిమా మొత్తం లో కూడా ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటూనే గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది అంటూ మొదట్లోనే కొరటాల శివ ఆమె పాత్ర గురించి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇచ్చాడు… ఇక నిన్న వచ్చిన ఈ పాటతో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే ఈ ఒక్క సినిమాతోనే స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోబోతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఆరేళ్లలో ఆమెకి ఎప్పుడు రాని గుర్తింపు ఒక్క సాంగ్ వల్ల ఓవర్ నైట్ లో వచ్చేసింది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు…

    ఇక మొత్తానికైతే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు కొరటాల ఫ్యాన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది…

    Also Read: మొగిలి రేకులు’ సిరియల్ లో నటించిన ఈమె తో పాటు తన కూతురు కూడా నటినే.. ఎవరో చెప్పుకోండి?