Devara song Review : దేవర సాంగ్ ఇలా ఉందేంటి..? అనిరుధ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు…

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి 'యంగ్ టైగర్ ' గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఎన్టీయార్...ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది...

Written By: Gopi, Updated On : August 5, 2024 8:07 pm

Devara song

Follow us on

Devara song Review : తెలుగు లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ,అల్లు అర్జున్ లాంటి వారు ముందు స్థానం లో ఉన్నారు. ఇక వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలైతే ఉంటున్నాయి. ఇక అలాగే వీళ్లు చేస్తున్న సినిమాల మీద భారీ అంచనాలు కూడా క్రియేట్ అవుతుంటాయి. ఇక అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘దేవర’ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా జనాల్లో కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఇదే క్రమంలో ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ భారీ ప్రమోషన్స్ ను చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే దేవర సినిమా నుంచి “చుట్టమల్లే ” అనే లిరిక్స్ తో సాగే ఒక రొమాంటిక్ సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఇక యూట్యూబ్ లో ఈ సాంగ్ కి మంచి ఆదరణ దక్కుతుంది. ఇక మొత్తానికైతే ఈ సాంగ్ రామ జోగయ్య శాస్త్రి రాశాడు. అనిరుధ్ ఈ సాంగ్ కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ఈ సాంగ్ ని చూస్తుంటే ఎన్టీయార్ జాన్వీ కపూర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది బాగా వర్క్ అవుట్ అయినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ లిరిక్స్ కూడా ఆ సిచువేషన్ కి తగ్గట్టుగా రాశారు.

కానీ మ్యూజిక్ విషయంలోనే సాంగ్ కి అంత హైప్ అయితే రావడం లేదు. ఇంతకు ముందు అనిరుధ్ తన మ్యూజిక్ తో వండర్స్ ని క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఇంతకు ముందు రిలీజ్ అయిన సాంగ్ గాని, ఈ సాంగ్ విషయంలో కానీ ఆయన అంత పెద్దగా కేర్ అయితే తీసుకున్నట్టుగా అనిపించడం లేదు. పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంటే ఈ సాంగ్స్ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది దేవర సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటే బాగుండేది అంటూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే కొరటాల చేసిన మొదటి నాలుగు సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలు మ్యూజికల్ గా హిట్ అయ్యాయి. అలాగే కమర్షియల్ గా కూడా సూపర్ హిట్లు గా నిలిచాయి. ఇక చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమాకి మణిశర్మ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు. మొదటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ కొరటాల కాంబినేషన్ సూపర్ హిట్టు కాంబోగా మంచి గుర్తింపును సంపాదించుకుంది…ఇక ఇదిలా ఉంటే అనిరుధ్ ఇక మీదట రాబోయే అన్ని సాంగ్స్ కి ఇలాంటి మ్యూజిక్ నే ఇస్తే ఇక దేవర సినిమా పరిస్థితి అంతే…

ఇక ఇప్పటి వరకు ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ మీదట రాబోయే సాంగ్స్ అయిన మంచి మ్యూజిక్ తో వస్తే ఈ సినిమా మీద భారీ హైప్ ఏర్పడుతుంది. ఇక లేకపోతే మాత్రం కష్టమే… మరి ఎన్టీయార్ అనుకుంటున్నట్లుగా ఈ సినిమా పాన్ ఇండియా లో భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.