Movie Reviewers: ఒక సినిమాను జడ్జ్ చేయడం లో రివ్యూవర్స్ పాత్ర కీలకమా..? వాళ్ల వల్లే కొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ప్రపంచం లాంటిది. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే ఆ ప్రపంచం లో నిలువగలుగుతారు. ఇక ఇది భారీ వ్యయం తో కూడుకున్నది కూడా కావడం విశేషం....

Written By: Chai Muchhata, Updated On : August 6, 2024 10:31 am

movie critics

Follow us on

Movie Reviewers: ప్రస్తుతం సినిమా అనేది సగటు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. హ్యాపీ గా ఉన్న, సాడ్ గా ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూడాలని అనుకుంటారు. ఎందుకంటే సినిమాలో ఉండే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసినా, లేదంటే కుటుంబ సభ్యులు కలిసిన కూడా ఒక మంచి సినిమా చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ని ఇస్తూ ఉంటారు. ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన మౌత్ పబ్లిసిటీ అనేది ఎప్పటికప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే కొంతమంది రివ్యూలు రాసే వాళ్ళు మాత్రం సినిమాని కరెక్ట్ గా అంచనా వేయడం లేదు అంటూ చాలా రోజుల నుంచి ఆయా సినిమా దర్శక నిర్మాతలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు… నిజానికి ఒక సినిమా బాగుంది, బాలేదు అని రివ్యూ రాసే అతను ఎలా జడ్జ్ చేయగలుగుతాడు. అతను ఒక్కడి ఒపీనియన్ వల్ల జనం మొత్తానికి అదే ఒపీనియన్ ఉంటుందనే నమ్మకం ఏముంది.. ఒక దర్శకుడు రాసుకున్న కథ బావుందని మొత్తం టీమ్ ను నమ్మించి సినిమా చేసినప్పుడు ఆ టీమ్ లో ఉన్న అందరికీ నచ్చిన సినిమా ఒక రివ్యూ రాసే వాళ్లకు మాత్రమే ఎందుకు నచ్చడం లేదు. నిజానికి ఒక పాజిటివ్ రివ్యూ వల్ల ఎంతమంది సినిమా థియేటర్ కు వస్తారో లేదో తెలియదు కానీ, ఒక నెగటివ్ రివ్యూ వల్ల మాత్రం చాలా మందికి సినిమా ను చూడాలనే ఇంట్రెస్ట్ ను కోల్పోతున్నారు… నిజానికి రివ్యూలు రాసే వ్యక్తికి థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం ఉందనుకుంటే అతనికి కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఎలా నచ్చుతాయి.కాబట్టి ఆ సినిమాలు చూసిన వెంటనే ఆయన అవి బాగాలేవని రాస్తూ ఉంటాడు.

అంటే కేవలం ఆయనకి నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మాత్రమే బాగున్నాయి అనే ఉద్దేశ్యం లో ఉంటాడనే వాదనను సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొంతమంది రివ్యూ ఇచ్చేవాళ్ళు మాత్రం ఆ సినిమాలో మ్యాటర్ ఏం లేదు వేస్ట్ సినిమా అంటున్నారు…కానీ ప్రేక్షకులు మాత్రం దానిని హిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమాను రివ్యూవర్స్ కి నచ్చేలా తీయాల లేదంటే ప్రేక్షకులకి నచ్చేలా తీయాలా…

ఉదాహరణకు సాయి ధరమ్ తేజ్ తీసిన ‘రిపబ్లిక్’ సినిమాను కనక చూసుకుంటే ఈ సినిమా విమర్శకులు, రివ్యూవర్స్ కి బాగా నచ్చింది. కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఫైనల్ గా ఈ సినిమా ను ప్లాప్ అన్నారు. ఇక డైరెక్టర్ దేవకట్టా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరొక సినిమా అయితే చేయలేదు… కానీ పూరి జగన్నాధ్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి మొదట నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. కానీ సినిమా ప్రేక్షకులకు నచ్చింది…ఫైనల్ గా ఆ సినిమా హిట్ అయింది. పూరి మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాను తీశాడు…అంటే ఇక్కడ రివ్యూ రాసేవాళ్ళ మైండ్ సెట్ సినిమా ఆడియన్స్ ఆలోచన విధానం ఒకేలా ఉండటం లేదా..?

అలాంటప్పుడు ఈ సినిమా బాగుంది ఈ మూవీ బాగాలేదని రివ్యూవర్స్ చెప్పడం కరెక్టేనా..? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే అవకాశం అయితే ఉంది. కానీ మనకు నచ్చిన సినిమా మిగతా వాళ్లకు నచ్చలని, మనకి నచ్చని సినిమా మిగతా వాళ్లకు కూడా నచ్చదని మనం 100% చెప్పలేం… కానీ కొంత మంది ఇచ్చే రివ్యూస్ వల్ల మంచి సినిమాలు కూడా చచ్చిపోతున్నాయి అనేది మాత్రం వాస్తవం…