Brahma Mudi Serial Actress: సినిమా ఇండస్ట్రీ రంగుల ప్రపంచం ఒక్కసారి అవకాశం వస్తే జీవితమే మారిపోతుంది. వారి జీవితమే కాకుండా వారి వారసులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా మంది ఎంటర్టైన్మెంట్ రంగంపై ఆసక్తి ఉన్నవారు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతామని ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఈ పరిశ్రమలో అవకాశం దొరికినా సెటిలైన తరువాత వారి వారసులను కూడా తీసుకొస్తారు. వారి కుమారులు లేదా కూతుళ్లను పరిచయం చేస్తారు. నిన్నటి వరకు సినీ ఇండస్ట్రీ సినిమాలతో కళకళలాడింది. కానీ కరోనా తరువాత ఈ పరిశ్రమ తీరు మారిపోయింది. సినిమాలు రావడం తగ్గాయి. కొన్ని వచ్చినా.. ఆవి వెంటనే ఓటీటీలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో టీవీ సీరియల్స్ కు ప్రాధాన్యత పెరిగిపోతుంది. ఈ మధ్య కొన్ని టీవీ సీరియల్స్ సినిమా రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఇందులో నటించిన వారు ఫేమస్ అవుతున్నారు. అంతేకాకుండా వారి రెమ్యూనరేషన్ కూడా బాగా ఉండడంతో చాలా మంది టీవీ సీరియల్ లో నటించడానికి ముందుకు వస్తున్నారు. అయితే అలనాడు ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. వారు నటించడమే కాకుండా వారికి సంబంధించిన వారిని పరిచయం చేస్తున్నారు. అయితే ఓ ప్రముఖ టీవీ సీరియల్ తోఫేమస్ అయిన ఓ నటి తాను నటిస్తూనే.. తన కూతురును వెండితెరకు పరిచయం చేశారు. ఇప్పుడు తల్లీ కూతుళ్లు ఈ రంగంలో రాణిస్తున్నారు.. ఇంతకీ ఎవరు వాళ్లు?
20వ దశకం ప్రారంభంలో సినిమాల హవా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో టీవీలు కూడా పెద్దగా లేకపోవడంతో టీవీ సీరియల్స్ ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ 2000 సంవత్సంలో జెమినీ టీవీలో ప్రసారం అయిన ‘చక్రవాకం’ సీరియల్.. ఆ రంగాన్నే మార్చేసింది. ఈ సీరియల్ తో చాలా మంది టీవీలకే అతుక్కుపోయారు. కొందరుకొత్తగా టీవీలు కొనుక్కున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ సీరియల్ 1360 ఎపిసోడ్లతో అలరిచింది. దీంతో ఇందులో నటించిన వాళ్లు ఫేమస్ అయ్యారు. ఈ సీరియల్ తరువాత ‘మొగలి రేకులు’ సిరియల్ కూడా భాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే మొగలి రేకులు సీరియల్ నటించిన వాళ్లలో ఇంద్రనీల్, సాగర్, షీలా సింగ్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు శ్రీప్రియ శ్రీకర్ నటించారు.
అయితే ఆ తరువాత డైరెక్టర్ శ్రీకర్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘బ్రహ్మముడి’ అనే సీరియల్ లోఅపర్ణ పాత్రలో నటించారు. ఈ పాత్రతో శ్రీప్రియ శ్రీకర్ మరోసారి ఫేమస్ అయ్యారు. అలా మొత్తం 30 సీరియల్స్ లో నటించారు. అయితే ఆప్పటికీ, ఇప్పటికే శ్రీప్రియ తల్లి పాత్రలోనే నటిస్తున్నారు. అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీప్రియ, శ్రీకర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వీరిలో ఒకరు చరిష్మా శ్రీకర్, ఆమె ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. రుద్రంగి, లక్ష్మీ కటాక్షం అనే సినిమాల్లో కనిపించారు.
తల్లి బుల్లితెరపై, కూతురు వెండితెరపై రాణించడంతో కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వీరికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోభాగంగా శ్రీప్రియ శ్రీకర్ తన కూతురు చరిష్మా శ్రీకర్ తో పాటు కుటుంబ సభ్యలతో ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో శ్రీ ప్రియ తన చిన్న నాటి పిక్స్ ను కూడా షేర్ చేసింది. ఈ వీడియోకు చాలా మంది లైక్ కొడుతున్నారు.