Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గురించి మనం ఎంత ఎక్కువ గా చెప్పుకున్న కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు అలాంటివి…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే మహేష్ బాబుతో చేయాల్సిన పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని తొందర్లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇంతకు ముందు రాజమౌళి తన కొడుకుని హీరోగా ఎందుకు పరిచయం చేయలేదు అంటూ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. దానికి ఆయన సమాధానం చెబుతూ మా ఫ్యామిలీలో ఎవరికి లేని బిజినెస్ థాట్స్ వాడికున్నాయి. సినిమాల కంటే వాడు బిజినెస్ లో ఎక్కువ రాణిస్తాడనే ఉద్దేశ్యం తోనే వాడిని బిజినెస్ రంగం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాము అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆ విధంగానే కార్తికేయ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా రంగంలోనే డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఇంతకు ముందు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమాని తెలుగులో రిలీజ్ చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక దాంతో పాటుగా ప్రస్తుతం ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘దేవర ‘ సినిమాకు సంబంధించిన రైట్స్ ని కూడా తను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: దేవర సాంగ్ ఇలా ఉందేంటి..? అనిరుధ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు…
ఇక కర్ణాటక రాష్ట్రం లోని దేవర రైట్స్ ని కార్తికేయ దక్కించుకున్నారట. ఇక ఈ సినిమాతో వసూళ్లు భారీ గా వస్తాయని అంచనా వేసిన కార్తికేయ ఈ పని చేయడం అనేది నిజంగా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి. ఇక ఒక్కొక్క మెట్టు తను పైకి ఎదుగుతూ టాప్ ప్రొడ్యూసర్ గా దుసుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఇక మొత్తానికైతే కార్తికేయ వాళ్ల ఫాదర్ అయిన రాజమౌళి మీద డిపెండ్ అవ్వకుండా తనకు తాను సెపరేట్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
కాబట్టి తప్పకుండా ఆయన అనుకున్న ఫీట్స్ సాధిస్తాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, రాజమౌళి అభిమానులు కూడా మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు… ఇక వీటితో పాటుగా రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన పనులను కూడా తను దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి మీద ఎక్కువగా ప్రేజర్ పడకుండా మిగతా విషయాలన్నిటిని తనే కంట్రోల్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడట…ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
ఇక ఇప్పటికైనా రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాడా? లేదా అంటూ అటు మహేష్ బాబు అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు… చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని ఏ రేంజ్ లోకి తీసుకెళ్తాడు అనేది… ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం రాజమౌళి కూడా హాలీవుడ్ దర్శకులతో పాటు పోటీ పడతాడనే చెప్పాలి…
Also Read: మొగిలి రేకులు’ సిరియల్ లో నటించిన ఈమె తో పాటు తన కూతురు కూడా నటినే.. ఎవరో చెప్పుకోండి?