https://oktelugu.com/

Allu Arjun: మెగా అల్లు కుటుంబాల మధ్య ఏం జరుగుతుంది. మెగా వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎందుకు లెఫ్ట్ అయ్యాడు..?

పవన్ కళ్యాణ్ కోసం ట్విట్టర్ లో ట్వీట్ చేసిన అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర రెడ్డికి మాత్రం డైరెక్ట్ గా వెళ్లి ప్రచారంలో పాల్గొని ఆయనకు ఓట్లు వేయమని ప్రజలకు తెలియజేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 19, 2024 / 04:58 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: ప్రస్తుతం మెగా, అల్లు కుటుంబాల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కోసం ట్విట్టర్ లో ట్వీట్ చేసిన అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర రెడ్డికి మాత్రం డైరెక్ట్ గా వెళ్లి ప్రచారంలో పాల్గొని ఆయనకు ఓట్లు వేయమని ప్రజలకు తెలియజేశాడు.

    అయితే ఈ విషయం మీద పలు రకాల వివాదాలనైతే అల్లు అర్జున్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇది కాదన్నట్టు నాగబాబు చేసిన ఒక ట్వీట్ కూడా వైరల్ అయింది. అందులో ఏముందంటే ‘మన అనుకున్న వాడు పరాయివాడికి సపోర్ట్ చేస్తే వాడు కూడా పరాయివాడే అవుతాడు’ అంటూ ఆయన చేసిన ఓ ట్వీట్ కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది. ఇక నాగబాబు ట్వీట్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబు పైన నెగిటివ్ కామెంట్లను పెడుతూ వచ్చారు. ఇలా మొత్తానికైతే కొద్దీ రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది. ఇక నాగబాబు ను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది.

    అదేంటి అంటే ‘మా తాత అల్లు రామలింగయ్య లేకపోతే నువ్వు బాపట్ల పోస్ట్ ఆఫీస్ దగ్గర పంచర్లు చేస్తూ ఉండేవాడివి’ అంటూ నాగబాబుని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అయింది. అయితే అది నిజంగానే అల్లు అర్జున్ చేశాడా? లేదా తన అభిమానులు ఎవరైనా చేసి దాన్ని ఎడిట్ చేశారా అనే దానిమీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేదు. ఇక అల్లు అర్జున్ కూడా ఈ విషయం మీద ఏ రకంగా స్పందించలేదు. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి ఒక గ్రూప్ అయితే ఉందట. దాంట్లో ఎవరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని వాళ్ళు తెలియజేస్తారట.

    ఇక ఏదైనా ఫంక్షన్స్ గాని, పార్టీస్ గాని ఉన్నా కూడా అందులోనే మెసేజ్ లు పెడుతూ ఉంటారట. ఇక రీసెంట్ గా ఈ గ్రూపు నుంచి అల్లు అర్జున్ లెఫ్ట్ అయిపోయాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మొత్తానికైతే మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య దూరం బాగా ఎక్కువగా పెరిగిపోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…