Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఈ సినిమా అన్ని కుదిరితే ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్ళేది కానీ గేమ్ చేంజర్ సినిమా లేట్ అవుతుండటం వల్ల ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడుతుంది.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గానే బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ వెర్షన్ మొత్తాన్ని రామ్ చరణ్ కి వినిపించారట. దాంతో రామ్ చరణ్ కి ఈ కథ లో కొన్ని డౌట్లైతే వచ్చాయట. ఇక దానికి బుచ్చిబాబు చెప్పే క్లారిటీతో సాటిస్ఫై అవ్వకపోవడంతో రామ్ చరణ్ సుకుమార్ ని పిలిపించారట. ఇక సుకుమార్ అప్పుడు దానికి ఒక క్లారిటీ ఇవ్వడంతో రామ్ చరణ్ కి ఈ కథ మీద మళ్ళీ నమ్మకం కుదిరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒక ఫైనల్ వెర్షన్ చెప్పినప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని రామ్ చరణ్ చెప్పడం తో బుచ్చి బాబు మళ్ళీ ఆ కథను కొంచెం మార్చి తీసుకొచ్చారట.
అయితే చరణ్ కి దీంట్లో కూడా కొన్ని డౌట్స్ రావడం తో ఆయనకి క్లారిటీ ఇవ్వడానికి సుకుమార్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో బుచ్చిబాబు రామ్ చరణ్ స్టార్ డమ్ ను హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వీళ్ళు భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నారు.
చూడాలి మరి ఈ సినిమాతో వాళ్లు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది ఈ సినిమా రంగస్థలం సినిమాను మించి ఉంటుందంటూ బుచ్చిబాబు కొన్ని ఈవెంట్లలో చెబుతూ వస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…