Chiranjeevi: హీరో రామ్ దేవదాస్ సినిమా చూసి చిరంజీవి ఏమన్నారంటే..?

చిరంజీవి రామ్ తో ఇది నీకు మొదటి సినిమానా అని అడిగాడట. దాంతో రామ్ అవును సార్ అని చెప్పడట. అప్పుడు చిరంజీవి ఏంటయ్యా అలా చేశావు సూపర్ అంటూ చిరంజీవి రామ్ ను మెచ్చుకున్నాడట. ఇక ఈ విషయాన్ని రామ్ ఒక ఈవెంట్ లో చిరంజీవి ముందే చెప్పడం విశేషం.

Written By: Gopi, Updated On : June 9, 2024 1:03 pm

Chiranjeevi

Follow us on

Chiranjeevi: దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా కెరీర్ ని కూడా అప్పటి నుంచే బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తను క్లాస్, మాస్ యాంగిల్స్ రెండింటిని టచ్ చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఇక మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్ వల్లే ఆయన హీరోగా నిలబడడం చాలా సులభమైంది.

ఇక ఈ సినిమాని చూసిన తర్వాత చిరంజీవి రామ్ తో ఇది నీకు మొదటి సినిమానా అని అడిగాడట. దాంతో రామ్ అవును సార్ అని చెప్పడట. అప్పుడు చిరంజీవి ఏంటయ్యా అలా చేశావు సూపర్ అంటూ చిరంజీవి రామ్ ను మెచ్చుకున్నాడట. ఇక ఈ విషయాన్ని రామ్ ఒక ఈవెంట్ లో చిరంజీవి ముందే చెప్పడం విశేషం. ఇక ఇదిలా ఉంటే మొదటి సినిమాతోనే చిరంజీవి చేత ప్రశంసలను అందుకున్న రామ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి మాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రామ్ తో సినిమా చేయడానికి చాలామంది యంగ్ దర్శకులతో పాటు, సీనియర్ డైరెక్టర్స్ కూడా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే స్కంద సినిమాతో బోయపాటి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసిన ఆయన ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రెండో సారి నటిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ తో రామ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

ఇక చాలా రోజుల నుంచి వీళ్ళ సినిమా ఉంటుంది అంటూ వార్తలు వచ్చినప్పటికి వీళ్ళ కాంబినేషన్ మాత్రం పట్టాలెక్కడం లేదు. ఇక ఈసారి తప్పకుండా రామ్ త్రివిక్రమ్ కాంబో సెట్ అవుతుందంటు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అయితే అందుతుంది…