https://oktelugu.com/

Gangs Of Godavari OTT: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అప్పుడే ఓటీటీలోనా..! అధికారికంగా ప్రకటించేశారుగా

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా బాలకృష్ణ వచ్చారు. దాంతో మంచి ప్రచారం దక్కింది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ పర్లేదు అనిపించాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : June 9, 2024 / 12:58 PM IST

    Gangs Of Godavari OTT

    Follow us on

    Gangs Of Godavari OTT: విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సమయానికి ముందే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రెండు వారాలు కూడా గడవక ముందే గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఓటీటీ డేట్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. సమ్మర్ కానుకగా మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల చేశారు. నిజానికి గత ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

    ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా బాలకృష్ణ వచ్చారు. దాంతో మంచి ప్రచారం దక్కింది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ పర్లేదు అనిపించాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సినిమాకు మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి థియేట్రికల్ రన్ ఇంకా ముగియలేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.

    అయితే నేడు అధికారికంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో చాలా త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. సాధారణంగా థియేటర్స్ లోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది. గతంలో ఈ మేరకు నిర్మాతలు ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ ఎవరూ పాటించడం లేదు. ఇది పరిణామం థియేటర్స్ మనుగడకే ముప్పుగా మారింది.

    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ విషయానికి వస్తే… రాజమండ్రి సమీపంలో గల లంక గ్రామానికి చెందిన రత్నం(విశ్వక్ సేన్)అడ్డదారిలో దొంగ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రధాన శత్రువులు అతనికి తయారవుతారు. మరి ఆ శత్రువులను రత్నం ఎలా ఎదుర్కొన్నాడు? రత్నంలో మార్పు వచ్చిందా? అనేది మిగతా కథ..