https://oktelugu.com/

Vijayendra Prasad: త్రిబుల్ ఆర్ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పిన విజయేంద్రప్రసాద్…

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేశాడు. అయినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు.

Written By: , Updated On : June 9, 2024 / 11:51 AM IST
Vijayendra Prasad

Vijayendra Prasad

Follow us on

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆయన్ని మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా క్రేజ్ ను సంపాదించుకొని తన స్టార్ డమ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ సూపర్ హిట్ల ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేశాడు. అయినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ సినిమా స్టోరీని పవన్ కళ్యాణ్ కి ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న అడిగినప్పుడు ఆయన దానికి సమాధానంగా ఆ సినిమా మల్టీ స్టారర్ సినిమా.. ఒకవేళ మేము ఆ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాలని అతనికి కథ చెప్పిన కూడా అతని స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే మరొక హీరో ఇండస్ట్రీలో లేరు.

అందుకే ఆయనతో ఈ సినిమా చేయలేదు అని చాలా క్లియర్ గా విజయేంద్రప్రసాద్ చెప్పాడు. ఇక ఈ న్యూస్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను మించిన స్టార్ హీరో నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది వాస్తవం… ఇక ఇప్పుడున్న హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ముందు వాళ్ళు సంపాదించుకున్న గుర్తింపైతే చాలా తక్కువనే చెప్పాలి. ఆయన తలుచుకుంటే ఎప్పుడో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ని అందుకునేవాడు.

ఇక ఒకానొక సమయంలో షారుక్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాము బాలీవుడ్ లో సినిమా చేయమని ఆయనకు ఆఫర్లు వచ్చిన కూడా ఆయన వాటిని సున్నితంగా రిజెక్ట్ చేశాడు… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా తొందర్లోనే మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది…