Tomatoes: టమాటల వల్ల బరువు కూడా తగ్గవచ్చా?

టమాటాలలో కేలరీలు తక్కువ అయితే పోషకాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి విటమిన్స్, ఖనిజాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

Written By: Swathi, Updated On : June 9, 2024 11:55 am

Tomatoes

Follow us on

Tomatoes: పుల్లగా ఉండే టమోటాలో పోషకాలు ఎక్కువే. ఇక ఇది వంటల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది టమాట. సరిగ్గా ఉపయోగిస్తే బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుందట. మరి అవేంటో తెలుసుకుందామా? ఈ టమాటలను స్నాక్‌లా కూడా తినొచ్చు. మరి స్నాక్స్ కోసం ఏం చేయాలంటే..కాస్తా ఉడికించి ఉప్పు, మిరియాల పొడితో కాల్చి తినేయాలి అంతే. ఇది డైట్ చేసేవారికి బెస్ట్ స్నాక్. కేలరీలు తక్కువ కాబట్టి బరువు కూడా తగ్గుతారు.

టమాటాలలో కేలరీలు తక్కువ అయితే పోషకాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి విటమిన్స్, ఖనిజాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంటాయి. క్యాలరీలు తక్కువ ఉండటంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి అంటున్నారు నిపుణులు.

బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గించి శరీర బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఆకలిని అరికడుతుంది. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇందులో ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగైతుంది. దీనికి కారణం టామాటాలో 95 శాతం నీరు ఉండటమే.

టమాటోల్లోని ఫైబర్, వాటర్ కంటెంట్ రెండూ కూడా కడుపు నిండుగా ఉండి.. చాలా సేపటి వరకూ ఆకలి కలగకుండా చూస్తాయి. అతిగా తినడాన్ని కంట్రోల్ చేస్తాయి. అయితే వీటిని సలాడ్‌లా తీసుకోవచ్చు. సూప్‌గా కూడా తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది.