Vignesh Shivan: విఘ్నేశ్ శివన్ చేసిన చిన్న పొరపాటు వల్ల భారీ ట్రోలింగ్.. ఎందుకంటే..

లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ బయోలో లియో సినిమాను ఆ మధ్య తీసేశాడు. లియో సినిమాను లిస్ట్‌లోంచి అలా తీసేయడంతో సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంతా అనుకున్నారు.

Written By: Neelambaram, Updated On : October 9, 2023 4:07 pm
Follow us on

Vignesh Shivan: తెలిసి తెలయక కొన్ని పనులు చేసి మీరు ఎప్పుడు అయినా చిక్కుల్లో పడ్డారా? పడే ఉంటారు. కొన్ని సార్లు మంచి అనుకున్నది కూడా చెడు అవచ్చు. చెడు అనుకున్నది మంచి అవచ్చు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చేసే పోస్టులలో కొందరు తప్పులు వెతికితే మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటారు. ఇక సెలబ్రెటీలు ఏదైనా పోస్ట్ చేస్తే అవి నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. అయితే రీసెంట్ గా విఘ్నేశ్ శివన్ చేసిన చిన్న పొరపాటు కూడా ఇలాంటి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు టార్గెట్‌గా మారుతారో చెప్పడం కష్టం. నెట్టింట్లో సెలెబ్రిటీలు చేసే చిన్న చిన్న పనులను సైతం భూతద్దంలో పెట్టి చూస్తుంటారు నెటిజన్లు. ఏదో ఒక ట్వీట్‌ను ఏదో ఒక పోస్ట్‌ను బై మిస్టేక్‌లో లైక్ కొట్టినా, ఫాలో అయినా, రీ ట్వీట్ వేసినా జనాలు వెంటనే పసిగడతారు. అది ఎందుకు లైక్ చేశారు.. ఇది ఎందుకు చేశారు? అంటూ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ నిలదీస్తుంటారు. తాజాగా విఘ్నేశ్ శివన్ సైతం పూర్తిగా చూడని, తెలియని ఓ ట్వీట్‌ను లైక్ చేశాడు. చిక్కుల్లో పడ్డాడు. దీంతో విజయ్, లోకి ఫ్యాన్స్ ఇరువురు విఘ్నేశ్‌ను ఆడేసుకుంటున్నారు.

లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ బయోలో లియో సినిమాను ఆ మధ్య తీసేశాడు. లియో సినిమాను లిస్ట్‌లోంచి అలా తీసేయడంతో సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంతా అనుకున్నారు. నా రెడీ అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన తరువాత ఈ ఘటన జరిగింది. విజయ్, లోకేష్ మధ్య ఏదో జరిగిందని అందుకే ఇలా చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. ఇదే విషయం మీద తమిళ మీడియాతో లోకేష్ ముచ్చటించాడు. దానికి సంబంధించిన ఓ ట్రోలింగ్ ట్వీట్‌ను విఘ్నేశ్ శివన్ లైక్ చేశాడు.

దీంతో విజయ్, లోకేష్ ఫ్యాన్స్ విఘ్నేశ్ మీద మండిపడ్డారు. దీంతో తన తప్పు తెలుసుకున్న విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ ట్వీట్ ఏంటో.. ఆ ఇంటర్వ్యూ ఏంటో చూడకుండా.. లోకేష్ ఫోటో ఉంది కదా? అని లైక్ చేశాను.. తప్పు తెలుసుకుని మళ్లీ డిలీట్ చేశాను.. అదొక సిల్లీ మిస్టేక్ దాన్ని పట్టుకుని మీరు టైం వేస్ట్ చేసుకోకండి.. విజయ్ సర్, లోకేష్ కనకరాజ్ అంటే నాకు చాలా ఇష్టం.. లియో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ఇలా సుదీర్ఘంగా చెప్పుకుంటూ పోయాడు విఘ్నేశ్.

సెన్సార్ పూర్తి అయిన తరువాతే నా బయోలో సినిమా పేర్లను పెట్టాలని అనుకున్నాను.. అందుకే లియోను తీశా.. సెన్సార్ అయిన తరువాత మళ్లీ యాడ్ చేశా.. రజినీకాంత్ సర్ మూవీని కూడా బయోలో పెట్టలేదు.. అని ఇలా లోకేష్ ఆ వివాదం మీద క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ ట్వీట్‌తో అయినా విఘ్నేశ్ మీద ట్రోలింగ్ ఆగుతుందేమో చూడాలి.

తెలిసి తెలియక చేసే చిన్న పొరపాటు వల్ల చూశారా ఎంత పెద్ద తతంగం నడిచిందో.. అయినా ఇలా సెలబ్రెటీలు ట్రోల్ కి గురవుతున్నారు అంటే.. దానికి కారణం కూడా నెటిజన్లే.. వారు పెట్టే పోస్టులను నెగటివ్ ను జోడించి ట్రోల్ చేయడం వల్ల మరింత ప్రభావం పడుతుంది. అందుకే వారి లైఫ్ లోకి కాస్త తక్కువగా తొంగిచూడడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొతమంది.