Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Rajamouli in devara theater mahesh movie update when here is the reaction

Rajamouli: దేవర థియేటర్ లో రాజమౌళి.. మహేష్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే.. రియాక్షన్ ఇదీ

దేవర చిత్రాన్ని థియేటర్ లో చూసేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన రాజమౌళికి విచిత్ర సంఘటన ఎదురైంది. మహేష్ అభిమానులు ఆయన్ని ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ కావాలని అడిగారు. అప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Written By:S.Reddy, Updated On : September 28, 2024 / 09:42 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Rajamouli In Devara Theater Mahesh Movie Update When Here Is The Reaction

Rajamouli(2)

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Rajamouli: ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ రికార్డు బ్రేకింగ్ వసూళ్ళు రాబడుతుంది. యూఎస్ లో దేవర వసూళ్లు $4 మిలియన్ కి చేరువయ్యాయి. వరల్డ్ వైడ్ దేవర ఫస్ట్ డే రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మినహాయిస్తే ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దేవర నమోదు చేసింది.

హిందీలో సైతం చెప్పుకోదగ్గ రెస్పాన్స్ దక్కుతుంది. ఫస్ట్ డే హిందీ వెర్షన్ రూ. 7-10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం కలదంటున్నారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. కాగా ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడైన రాజమౌళి కుటుంబ సమేతంగా దేవర చిత్రాన్ని అభిమానుల మధ్య వీక్షించాడు.

రాజమౌళి బాలానగర్ లో గల విమల్ థియేటర్ లో దేవర చూశారు. ఆ సమయంలో ఓ మహేష్ అభిమాని… రాజమౌళిని ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ ఇవ్వాలంటూ కోరాడు. కరువులో ఉన్నాం సర్, మహేష్ బాబు మూవీ అప్డేట్ ఏమిటో చెప్పండని వేడుకున్నాడు. దానికి రాజమౌళి ఏం మాట్లాడలేదు. ఫోన్ చూసుకుంటూ ఉండిపోయారు. అతని వైపు చూసి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది

మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. కోవిడ్ సమయంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడగా… రాజమౌళి ఇంటికి పరిమితం అయ్యారు. ఓ మీడియా ఛానల్ ఆయన్ని ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేయగా… తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది మే-జూన్ నెలల్లో మహేష్ బాబు మూవీ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపించింది.

ఇంత వరకు రాజమౌళి కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అధికారిక ప్రకటన పోస్టర్ కూడా వదల్లేదు. మహేష్ బాబు మాత్రం మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్నారు. రాజమౌళి మూవీలో మహేష్ లుక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ లో షూటింగ్ మొదలవుతుందనేది లేటెస్ట్ న్యూస్. మరి చూడాలి రాజమౌళి ఎప్పుడు ముహూర్తం పెట్టాడో..

S.Reddy

S.Reddy Author - OK Telugu

Web Title: Rajamouli in devara theater mahesh movie update when here is the reaction

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Latest Tollywood News
  • mahesh babu
  • Rajamouli
  • Rajamouli And Mahesh Babu
Follow OKTelugu on WhatsApp

Related News

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Sitara: వయసు కేవలం 12 ఏళ్లు కానీ సంపాదన మాత్రం కోట్లలో.. సినిమాలలోకి రాకముందే ఓ రేంజ్ లో క్రేజ్…

Sitara: వయసు కేవలం 12 ఏళ్లు కానీ సంపాదన మాత్రం కోట్లలో.. సినిమాలలోకి రాకముందే ఓ రేంజ్ లో క్రేజ్…

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Viral Photo : మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ కలల రాణి…ఎవరంటే..

Viral Photo : మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ కలల రాణి…ఎవరంటే..

Andhra King Taluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!

Andhra King Taluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్  ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.