Devara
Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారు ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇక ఆయన తర్వాత వాళ్ల ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు వచ్చాడు. బాలయ్య బాబు కూడా ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని హ్యాట్రిక్ విజయాలను కూడా నమోదు చేశాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే తను స్టార్ హీరోగా వెలుగొందాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరితో పాటుగా నందమూరి ఫ్యామిలీ లోని మూడోవ జనరేషన్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ త్రీ హీరోల్లో తను కూడా ఒక్కడిగా కొనసాగుతూ ఉండడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మార్చుకోవాలనే ప్రయత్నం చూస్తున్నాడు.
దానికోసమే విపరీతంగా కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఫ్రెండ్ గా ఈ సినిమాలో ‘వరుణ్ సందేశ్’ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను ఒక కీలకమైన సమయంలో ఎన్టీఆర్ ని కీలక దెబ్బ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బాహుబలి సినిమాలో కట్టప్ప ఎలాగైతే అమరేంద్ర బాహుబలి ని వెన్నుపోటు పొడిచాడో అలాగే వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీయార్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నప్పటికీ తను ఫ్రెండ్స్ వల్లే తను ఈ సినిమాలో మోసపోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఆ తర్వాత తను ఎలా రీయాక్ట్ అవబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి అనుకూలంగానే ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసే విధంగా ఆ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు. ముఖ్యంగా ఎమోషన్, సెంటిమెంట్ సీన్స్ కి ఎన్టీఆర్ పెద్ద పీట వేస్తాడు. ఇక దాంతో పాటుగా యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా తన సినిమాలో భారీగా ఉండే విధంగా డిజైన్ చేయించుకుంటాడు. ఇక దేవర సినిమా కూడా అలాంటి ఒక ఎమోషనల్ డ్రామా తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది.
ఇక సెప్టెంబర్ 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమా సక్సెస్ అనేది కొరటాలకు కూడా ఒక అగ్నిపరీక్ష గా మారింది. ఎందుకంటే తన గత చిత్రమైన ఆచార్య సినిమాతో బోలెడన్ని విమర్శలను మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఇండస్ట్రీలో దర్శకుడుగా కంటిన్యూ అవుతాడు. లేకపోతే మాత్రం ఆయనకు ఇండస్ట్రీ లో ఉన్న ఏ పెద్ద హీరో కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలైతే ఉండవు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Do you know who is the star hero who is playing the character who backs ntr in devara