Tollywood Heroes: సినిమాలో స్క్రీన్ మీద మాత్రమే కాదు. కొందరు రియల్ లైఫ్ లో కూడా హీరోలు ఉంటారు. వారు సంపాదించే దాంట్లో కాస్త సేవాకార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ఇలా రీల్ హీరోలు, రియల్ హీరోలుగా అవుతుంటారు. ఇంతకీ మీకు నచ్చిన కొందరు హీరోలు ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అందులో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. తను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో రక్తదానం చేస్తున్నారు. అంతేకాదు నేత్రదానాలకు మద్దతు ఇస్తున్నారు చిరంజీవి. ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అభిమానులు విజిల్స్ వేస్తూ థియేటర్లకు వస్తారు.
రజనీకాంత్: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు సహాయానికి విస్తృతంగా విరాళాలు ఇస్తుంటారు.
ధనుష్: తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయం ధనుష్. ఈయన కూడా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా పేద పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణకు మద్దతు ఇస్తుంటారు.
అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యాన్సర్ పేషెంట్లకు విరాళాలు అందించారు. అంతేకాదు విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంటారు బన్నీ. ఈయన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్ప 2తో రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
రామ్ చరణ్: తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు రామ్ చరణ్. సినిమాల్లో అయినా సేవలో అయినా తండ్రి బాటలో నడుస్తుంటారు చెర్రీ. రామ్ చరణ్ తన ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాలు, విపత్తు సహాయక చర్యలకు సహకరిస్తున్నారు.
మహేష్ బాబు: మహేష్ బాబు సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలకు గుండె ఆపరేషన్ లకు నిధులు ఇస్తుంటారు. గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నారు.
విజయ్, యష్: దళపతి విజయ్ విద్య, విపత్తు వంటి వాటికి విరాళాలు ఇస్తూ, తరచూ బాధిత కుటుంబాలకు నేరుగా సహాయం చేస్తుంటారు. ఇక యష్ కరువు సహాయానికి విరాళాలు అందించారు. కర్ణాటకలోని నిరుపేద పిల్లల విద్యకు
తోచిన సహాయం చేస్తుంటారు.
మోహన్ లాల్, నాగార్జున: మోహన్ లాల్ ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, సంక్షేమానికి సహకరిస్తున్నారు