Balakrishna : నందమూరి తారకరామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు చాలా తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. ముఖ్యంగా తనలోని మైనస్ లను సైతం ప్లస్ లుగా మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పించడంలో బాలయ్య ఎప్పటికప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు. అలాంటి బాలయ్య ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. తను చేయబోయే ప్రతి సినిమా స్టోరీ మొత్తం ఉంటుంటాడు. దాని తర్వాత డైరెక్టర్ కి పూర్తిగా సరెండర్ అయిపోయి తను ఏం చెబితే అది చేస్తుంటాడు. ఇక బాలయ్య బాబుకి కథ చెప్పేటప్పుడు కొన్ని ట్రిక్స్ ని ఫాలో అయితే అతను ఈజీగా సినిమాని ఓకే చేస్తాడు అంటూ కొంతమంది సినిమా మేకర్స్ సైతం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బాలయ్య బాబుతో సినిమా చేయాలంటే అతనికి కథ చెప్పేటప్పుడే సినిమాలోని కొన్ని కోర్ ఎమోషన్ సన్నివేశాలను పర్ఫెక్ట్ గా చెప్పాలి. రెండు మూడు హై ఎలివేషన్ సన్నివేశాలను సైతం బాలయ్య బాబుకి చాలా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయాలి. అందులో ఒక సెంటిమెంట్ సీన్ ని కూడా జోడించి చెబితే బాలయ్య బాబు ఈజీగా సినిమాను ఓకే చేసేస్తారట.
ఓవరాల్ గా కథ ఎలా ఉన్నా కూడా సినిమాను నడిపించేది ఎమోషన్ మాత్రమే కాబట్టి బాలయ్య దాన్ని బాగా నమ్ముతారట. అందువల్లే చాలామంది దర్శకులు బాలయ్య బాబుకి కథ వినిపించడానికి ముందు ఈ విషయాల్లో కథ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని వెళ్తారట. అలాగే తన క్యారెక్టర్జేషన్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పినట్లయితే మాత్రం బాలయ్య ఇంకా బాగా కనెక్ట్ అవుతుంటారట.
మొత్తానికైతే బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో అతను చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పర్ఫెక్ట్ గా డీల్ చేసుకున్న తర్వాతే ముందుకు సాగుతున్నాడు. అందుకే వరుసగా నాలుగు విజయాలైతే వచ్చాయి…రాబోయే రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చేయడానికి తను ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…
