Bharateeyudu 2: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సౌత్ నుంచి పాన్ ఇండియా దర్శకుడి గా ఎదిగిన మొదటి డైరెక్టర్ శంకర్…ఈయన చేసిన రోబో సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తన లాంటి దర్శకుడు మరొకరు లేరు అనేలా ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసే భారీ చిత్రాల మీద ప్రేక్షకుల్లో మంచి నమ్మకం అయితే ఉండేది. కానీ గత పది సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఆయన ప్రేక్షకుల్లో రోజురోజుకీ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో శంకర్ చేస్తున్న భారతీయుడు 2 సినిమా మీద కూడా ప్రేక్షకులకు మొదటి నుంచి మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది. మొదటి పార్ట్ కి సెకండ్ పార్ట్ కి మధ్య ఉన్న తేడాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.
ముందుగా 1996వ సంవత్సరంలో వచ్చిన ‘ భారతీయుడు’ సినిమా సమయంలో కరప్షన్ మీద అప్పటివరకు ఎలాంటి సినిమాలు రాలేదు. కాబట్టి అప్పుడున్న జనాలకి అది కొత్తగా అనిపించింది. దాంతో పాటుగా ఒక హీరో అనేవాడు నలిగిపోతూ ఉండడం కంటే తిరగబడి అన్యాయం, అవినీతి చేసిన వాళ్ళని చంపేస్తున్నాడు అనే పాయింట్ అప్పటి ప్రేక్షకులను చాలా ఎగ్జైట్ మెంట్ కి గురి చేసింది. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలా సినిమాలు ఇండస్ట్రీలో అదే కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. శంకర్ ఇప్పుడు కూడా అలాంటి కాన్సెప్ట్ నే ఎంచుకోవడం అనేది కొంచెం రొటీన్ గా మారింది. అదే ఆయనకు చాలా పెద్ద దెబ్బగా కూడా మారే అవకాశం అయితే ఉంది. ఇక భారతీయుడు సినిమాలో అవినీతి అక్రమాలని చూపిస్తూ వాటికి తగ్గ శిక్ష ను భారతీయుడు వేస్తుంటే చూసే ప్రేక్షకుడు ఎంజాయ్ చేశాడు.
కానీ ఈ సినిమాలో అలా కాదు అవినీతి అక్రమాలను చూపించకుండా సేనాపతి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళను చంపేస్తూ ఉంటాడు. దానివల్ల ప్రేక్షకుడిలో ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. సేనాపతి ఎందుకు వస్తున్నాడు ఎందుకు వారిని చంపుతున్నాడు అనే డైలమాలోనే జనాలు ఉన్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పేంటి ఎందుకు చంపుతున్నాడు అనేది క్లియర్ కట్ గా చూపించలేకపోయాడు. ఇక అది కూడా సినిమాకి భారీగా మైనస్ అయితే అయింది. ఇక సినిమా అధ్యంతం ఒకే టెంపులెట్ లో సాగింది. సినిమాకు సంబంధించిన అప్ అండ్ డౌన్ ఎలిమెంట్స్ కూడా మనకు ఎక్కడ పెద్దగా కనిపించవు…సేనాపతి ఇండియాకు తిరిగి వచ్చే ఎపిసోడ్స్ స్టార్టింగ్ లో జరిగిన కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక దాని తర్వాత సినిమాలో ఒక్కటి కూడా హై అనేది ఉండదు.
కానీ మొదటి పార్ట్ లో మాత్రం మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతి సిన్ లో ఒక హై అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రతి సీన్ లో కూడా ఒక ఇంటెన్స్ డ్రామా అనేది క్రియేట్ అవుతుంది. అది మనల్ని చివరి వరకు ఉత్కంఠకు గురి చేస్తూ సినిమా చూసే ప్రేక్షకుడిని హుక్ చేసి మరి చివరిదాకా లాక్కెల్తుంది. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయింది…మరి శంకర్ ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేశాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు…