Filmfare Awards: ఆర్ ఆర్ ఆర్ లో బెస్ట్ ఎవరో తేలిపోయింది.. ఫిలిం ఫేర్ అవార్డ్స్ విన్నర్స్ వీరే!

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలయ్యాక అతి పెద్ద వివాదం నడిచింది. ఈ మూవీలో మెగా-నందమూరి హీరోలు నటించారు. ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మెగా ఫ్యాన్స్ తరచుగా సోషల్ మీడియా వార్ కి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ పాత్రల్లో ఎవరికి ప్రాధాన్యత ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Written By: S Reddy, Updated On : July 13, 2024 10:53 am

Filmfare Awards

Follow us on

Filmfare Awards: ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో సత్తా చాటింది. 2022లో విడుదలైన తెలుగు చిత్రాలకు 68వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రకటించారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొత్తంగా 7 విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు వంటి ప్రధాన కేటగిరీలలో ఆర్ ఆర్ ఆర్ అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలయ్యాక అతి పెద్ద వివాదం నడిచింది. ఈ మూవీలో మెగా-నందమూరి హీరోలు నటించారు. ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మెగా ఫ్యాన్స్ తరచుగా సోషల్ మీడియా వార్ కి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ పాత్రల్లో ఎవరికి ప్రాధాన్యత ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

రాజమౌళి దాదాపు కొమరం భీమ్, సీతారామరాజు పాత్రలను సమానంగా తీర్చిదిద్దాడు. రెండు పాత్రలకు ప్రాధాన్యత, స్క్రీన్ స్పేస్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారనే వాదన వినిపించింది. దాంతో ఎన్టీఆర్ సెకండ్ హీరో అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీమ్ పాత్రే మెయిన్ అంటూ మెగా ఫ్యాన్స్ మీద ఎదురుదాడికి దిగారు.

ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు అవుతున్నా ఈ వివాదం సమసిపోలేదు. అప్పుడప్పుడు ఆర్ ఆర్ ఆర్ కేంద్రంగా ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ మాటల దాడికి దిగుతూ ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎవరు గొప్పో తాజా అవార్డు తేల్చేసింది. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 అవార్డుల ప్రకటన జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. అనూహ్యంగా ఉత్తమ నటుడు అవార్డును ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు సంయుక్తంగా ఇచ్చారు. ఫిల్మ్ ఫేర్ కమిటీ కూడా డిప్లొమాటిక్ గా వ్యవహరించింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరి ఇస్తే మరొక హీరో ఫ్యాన్స్ మండిపడతారు. అందుకే ఎన్టీఆర్-రామ్ చరణ్ ఇద్దరూ సమానమే అని తేల్చేశారు. ఉత్తమ నటుడితో పాటు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నృత్యం, ఉత్తమ గాయకుడు, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత సీతారామం మూవీ అధిక అవార్డులు గెలుచుకుంది. సీతారామం చిత్రానికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. మృణాల్ ఠాకూర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో దుల్కర్ సల్మాన్ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రం క్రిటిక్స్ విభాగంలో సీతారామం మూవీ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ గాయని, ఉత్తమ సాహిత్యం విభాగాల్లో సీతారామం చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి.

విరాటపర్వం మూవీలో నటించిన సాయి పల్లవి ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డు అందుకుంది. ఉత్తమ సహాయ నటుడు అవార్డు భీమ్లా నాయక్ చిత్రానికి గానూ రానా గెలుచుకున్నాడు. విరాటపర్వం చిత్రానికి గానూ ఉత్తమ సహాయనటి అవార్డు నందితా దాస్ గెలుచుకుంది. గత ఏడాది ఈ అవార్డులు ప్రకటించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాలతో అవార్డుల ప్రకటన వాయిదా వేశారు.