https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 వల్ల శంకర్ కు వచ్చే లాభం ఏంటి..?అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి..?

విజువల్స్ పరంగా కూడా సూపర్ గా ఉంది. అయినప్పటికీ ఈ సినిమా ఆవరేజ్ గానే ఆడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దీని ద్వారా రామ్ చరణ్ సినిమాకి కూడా కొంతవరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక దాంతో రామ్ చరణ్ అభిమానులు చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2025 వ సంవత్సరంలోనే గేమ్ చేంజర్ సినిమాను తీసుకురావాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా 'ఇండియన్ 3' సినిమాని కూడా 2025 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని భారతీయుడు 2 సినిమా ఎండింగ్ లో అనౌన్స్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 10:19 AM IST

    Bharateeyudu 2

    Follow us on

    Bharateeyudu 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శంకర్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయి. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇంకా దానికి తోడుగా కమలహాసన్ యాక్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా శంకర్ కి మరొక లాభం కూడా చేకూరబోతున్నట్టుగా తెలుస్తుంది. గత పది సంవత్సరాల నుంచి అసలు ఒక్క సక్సెస్ కూడా లేకుండా ముందుకు సాగుతున్న శంకర్ ఈ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. నిజానికి శంకర్ మంచి డైరెక్టర్ అయినప్పటికీ తన కథల విషయంలో ఆయన చేస్తున్న తప్పుల వల్లే చాలా సినిమాలా రిజల్ట్స్ తేడా కొడుతున్నాయి అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే శంకర్ గత చిత్రాలను మనం చూసుకుంటే అందులో కథనే మైనస్ గా మారుతూ వస్తుంది. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో అయిన తను జాగ్రత్తలు వహిస్తాడా లేదా అంటూ చాలా రోజుల నుంచి అభిమానుల్లో చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తాయి. కానీ భారతీయుడు 2 సినిమాలో కథ అయితే బాగుంది.

    అలాగే విజువల్స్ పరంగా కూడా సూపర్ గా ఉంది. అయినప్పటికీ ఈ సినిమా ఆవరేజ్ గానే ఆడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దీని ద్వారా రామ్ చరణ్ సినిమాకి కూడా కొంతవరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక దాంతో రామ్ చరణ్ అభిమానులు చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2025 వ సంవత్సరంలోనే గేమ్ చేంజర్ సినిమాను తీసుకురావాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ‘ఇండియన్ 3’ సినిమాని కూడా 2025 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని భారతీయుడు 2 సినిమా ఎండింగ్ లో అనౌన్స్ చేశారు. మరి ఈ రెండు సినిమాలను ఒకే సంవత్సరంలో రిలీజ్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక భారతీయుడు 3 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ 30% కంప్లీట్ అయిందట. మిగతా 70% బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ కంప్లీట్ చేసి ఆ సినిమాను ఎలాగైనా సరే రిలీజ్ చేయాలని తను చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే గేమ్ చేంజర్ సినిమా మీద తన మొత్తం ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమాతో కనుక భారీ సక్సెస్ ని అందుకుంటే ఆయన పాన్ ఇండియా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడు.

    లేదంటే మాత్రం శంకర్ హవా తగ్గిపోవడం ఖాయం గా కనిపిస్తుంది. ఇక ఇలాంటి సందర్భంలో శంకర్ గేమ్ చేంజర్ సినిమాని ఎలాంటి సక్సెస్ గా నిలుపుతాడు తను ఎలాంటి గుర్తింపు పొందుతాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తాడు అనేది కూడా ఇక్కడ ఆసక్తిగా మారింది…చూడాలి మరి రామ్ చరణ్ కి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడా.? లేదంటే ఈ సినిమాను కూడా ఆవరేజ్ సినిమా గానే నిలుపుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…