Shobanbabu Assets: అలనాటి సూపర్ స్టార్స్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు శోభన్ బాబు..ఈయన సినిమా వస్తుందంటే చాలు ఆడవాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్స్ ని ఏర్పాటు చేసే వారు..ఫామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ లో ఆయనకీ ఉన్న ఫాలోయింగ్ అలాంటిది..ఇప్పటికి శోభన్ బాబు సినిమా టీవీ లో వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోతుంటారు..బౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సినీ నటులు ఎప్పటికి చిరంజీవులే అని శోభన్ బాబు గారి లాంటి లెజెండ్స్ ని చూసినప్పుడే అర్థం అవుతుంటాది..ఆంధ్ర ప్రజలు ముద్దుగా ఈయనని ‘సోగ్గాడు’ అని పిలుచుకుంటూ ఉంటారు..స్టార్ స్టేటస్ గొప్పగా ఉన్న సమయం లోనే ఇక సినిమాల్లో నటించింది చాలు అనుకోని, సినిమాలకు గుడ్బై చెప్పేసి చెన్నై లో స్థిరపడ్డ శోభన్ బాబు గారు 2008 వ సంవత్సరం లో చెన్నైలోని తన స్వగృహం లోనే కన్నుమూశారు..శోభన్ బాబు గారికి ‘కరుణ శేషు’ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు..ఈయన మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తూ ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా శోభన్ బాబు గారి ఆస్తుల గురించి ఇండస్ట్రీ లో ఎన్నో కథనాలు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..శోభన్ బాబు గారు సంపాదించిన డబ్బులను ఖర్చు చేసే విషయం లో చాలా ఆచి తూచి అడుగులు వేసేవారు అప్పట్లో..ఈయన చెప్పిన సూత్రాలను ఫాలో అయ్యి ఇండస్ట్రీ లో ఎంతో మంది సీనియర్ హీరోలు మరియు హీరోయిన్లు గొప్ప ఆస్తిపరులుగా స్థిరపడిపోయారు..శోభన్ బాబు గారు అప్పట్లో సినిమాల నుండి వచ్చే రెమ్యూనరేషన్స్ తో భూములను కొనుగోలు చేసేవారట..అలా ఆయన చెన్నైలో అప్పట్లోనే వేల ఎకరాలు భూములు కొనుగోలు చేసాడట.

ఇప్పుడు ఆ భూముల విలువ సుమారు 60 వేల కోట్ల రూపాయిలు ఉంటుందట..ఇంత భారీ మొత్తం విలువైన ఆస్తులు నిన్నటి తరం హీరోలకు గాని, నేటి తరం హీరోలకు గాని లేదు..శోభన్ బాబు గారి అడుగుజాడల్లో నడిచి సీనియర్ నటుడు మురళి మోహన్ కూడా హైదరాబాద్ లో అప్పట్లో ఎన్ని వందల ఎకరాలను కొనుగోలు చేసాడు..ఇప్పుడు మన ఇండస్ట్రీ అత్యధిక సంపన్నులు ఎవరు అనే లిస్ట్ తీస్తే మురళి మోహన్ గారు కూడా ఉంటారు..అలా శోభన్ బాబు ని ఫాలో అయ్యి ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ నేడు వాళ్ళ కుటుంబాలు కూర్చొని పది తరాలు తిన్నా కూడా తరగని రేంజ్ ఆస్తులను సంపాదించారు.
[…] […]
[…] […]