https://oktelugu.com/

Tejaswini: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చిన్న కూతురు… మోక్షజ్ఞ కోసం చూస్తుంటే ఇదేం ట్విస్ట్!

కొడుకు కంటే ముందే కూతురిని పరిశ్రమకు పరిచయం చేశారు బాలయ్య. ఇది ఇలా ఉంటే .. మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 11, 2024 / 08:41 AM IST

    Tejaswini

    Follow us on

    Tejaswini: నందమూరి బాలకృష్ణ తన నట వారసుడు మోక్షజ్ఞ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది. బాలయ్య కొడుకుని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. అయితే కొడుకు కంటే ముందే కూతురిని బాలయ్య ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

    నేడు బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెండో కూతురు తేజస్విని ని పరిచయం చేస్తూ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వస్తున్న నాలుగో సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. బిబి4 అనే వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ విడుదల చేయగా ప్రజంటర్ గా తేజస్విని పేరు వేశారు. దీంతో నిర్మాణ రంగంలోకి బాలయ్య కూతురు అడుగుపెడుతున్నారు.

    కొడుకు కంటే ముందే కూతురిని పరిశ్రమకు పరిచయం చేశారు బాలయ్య. ఇది ఇలా ఉంటే .. మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఈ సంవత్సరం కూడా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో కూతురిని నిర్మాతగా పరిచయం చేశాడు. బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ‘ బీబీ4 ‘ చిత్రానికి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుంది.

    14 రీల్స్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. నిన్న బాలయ్య బర్త్ డే పురస్కరించుకుని ఎన్ బి కే 109 నుంచి చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య కి ఇచ్చిన ఎలివేషన్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.