https://oktelugu.com/

Soggade Chinni Nayana: నాగార్జున చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…

ఇప్పటికీ మంచి కథలతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం తో చాలామంది యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ వాళ్ళు చెప్పే కథలను వింటున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన తన వందో సినిమాని చేసే పనిలో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 7, 2024 / 05:07 PM IST

    Soggade Chinni Nayana

    Follow us on

    Soggade Chinni Nayana: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ ను మార్చిన వాళ్లలో నందమూరి తారక రామారావు ఒకరైతే, అక్కినేని నాగేశ్వరరావు మరొకరు. ఇక వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఇక ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దాదాపు 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరో గా వెలుగొందుతున్నాడు.

    ఇక ఇప్పటికీ మంచి కథలతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం తో చాలామంది యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ వాళ్ళు చెప్పే కథలను వింటున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన తన వందో సినిమాని చేసే పనిలో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నాగార్జున కళ్యాణి కృష్ణ డైరెక్షన్ లో చేసిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట వేరే నటి ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ హీరోయిన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలోకి లావణ్య త్రిపాఠి ని తీసుకున్నట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

    అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటి అవకాశం కాజల్ కి వచ్చింది. కానీ ఆ పాత్ర తనకి అంతగా నచ్చకపోవడంతో ఆమె ఈ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిందంట.ఇక ఇప్పటివరకు ఆమె స్టార్ హీరోలందరితో నటించింది. కానీ నాగార్జున, వెంకటేష్ లతో మాత్రం హీరోయిన్ గా నటించలేదు.

    ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయినప్పటికీ మంచి క్యారెక్టర్లు దొరికితే తను సినిమాలో నటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తను ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ఇక అందుకు తగ్గట్టుగానే బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘భగవంత్ కేసరి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించడమే కాకుండా బాలయ్యతో పాటు కూడా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ని పోషించిందనే చెప్పాలి…