DJ Tillu: డీజే టిల్లు కి హనుమాన్ సినిమాకి మధ్య సంబంధం ఏంటి..?

ఇప్పుడు ఈ సినిమా కూడా దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక దానికి తోడుగానే ఈ సినిమా ప్రాంచైజ్ ను కొనసాగిస్తూ 'డీజే టిల్లు క్యూబ్' గా మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : April 7, 2024 5:02 pm

DJ Tillu

Follow us on

DJ Tillu: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. అందులో భాగంగానే యంగ్ హీరోలు కొత్త కథలతో వస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరోసారి పాన్ ఇండియా లెవెల్లో చాటి చెప్పిందనే చెప్పాలి. అలాగే ఒక దేవుడిని బేస్ చేసుకొని వచ్చిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఈ విషయంలో సినిమా మేకర్స్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే ప్రశాంత్ వర్మ తను రాసుకున్న కథను నమ్మి చాలా తక్కువ బడ్జెట్ లోనే అంత మంచి అవుట్ ఫుట్ ని తీసుకొచ్చి సినిమాని సూపర్ సక్సెస్ చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుంది. ఇక ఇది ఇలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి ముందుకు దూసుకెళ్తుంది. అయితే డీజే టిల్లు క్యారెక్టర్ మీద మొదటి నుంచి కూడా ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక డీజే టిల్లుగా వచ్చిన మొదటి పార్ట్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో దానికి సిక్వేల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ అనే సినిమాని తీసుకొచ్చారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక దానికి తోడుగానే ఈ సినిమా ప్రాంచైజ్ ను కొనసాగిస్తూ ‘డీజే టిల్లు క్యూబ్’ గా మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీన్ని కొంచెం ఎక్కువ బడ్జెట్ తో హనుమాన్ సినిమాను ఎలాగైతే తెరకెక్కించారో అలాంటి టెక్నాలజీని వాడి తెరకెక్కించాలనే ఉద్దేశ్యం లో ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక దానికి సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో సిద్దు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రకంగా హనుమాన్ సినిమా బాటలోనే డీజే టిల్లు కూడా సూపర్ మ్యాన్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వర్థాలైతే వస్తున్నాయి…