https://oktelugu.com/

Sreeleela: బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు సినిమాలో హీరోయిన్ గా చేయనున్న శ్రీలీల…

బాలీవుడ్ స్టార్ హీరో అయిన 'సైఫ్ అలీ ఖాన్' కొడుకు 'ఇబ్రహీం అలీ ఖాన్' హీరోగా 'దిలేర్ ' అనే సినిమా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా కి 'కృణాల్ దేశ్ ముఖ్' దర్శకత్వం వహిస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 8, 2024 / 06:54 PM IST

    Sreeleela

    Follow us on

    Sreeleela: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ పైనే పెడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న హీరోలు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడం లేదు. కాబట్టి వాళ్ళు సొంతంగా సినిమాలు చేయడం కంటే తెలుగు వాళ్ళ సపోర్టుతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందుకే వాళ్ళు చేసే సినిమాల్లో ఎక్కువగా తెలుగు యాక్టర్స్ ను గాని, టెక్నీషియన్స్ ని గాని తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నమైతే చేస్తున్నారు.

    ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన ‘సైఫ్ అలీ ఖాన్’ కొడుకు ‘ఇబ్రహీం అలీ ఖాన్’ హీరోగా ‘దిలేర్ ‘ అనే సినిమా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా కి ‘కృణాల్ దేశ్ ముఖ్’ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ ను జరుపుకుంది. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు లో స్టార్ హీరోయిన్ అయిన శ్రీలీల ను తీసుకుంటే బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే శ్రీలీల ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న మరొక సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉండడం విశేషం. ఇక బాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్స్ ని తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలుగు సినిమాల మీదే తను ఎక్కువగా ఫోకస్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు.

    కాబట్టి తనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలైతే రావడం లేదు. అందుకే మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మరి ఇక మీదట రాబోయే సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకుంటే తను పక్కగా మరోసారి స్టార్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…