Sitara: మహేష్ బాబు హెయిర్ మీద అసలు విషయాన్ని బయట పెట్టిన సితార…

మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి అనే దానిమీద పలు రకాల రూమర్లైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు జుట్టు గురించి పలు రకాల వార్తలైతే వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : May 26, 2024 9:03 am

Sitara

Follow us on

Sitara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు…ఇక ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన రాజమౌళితో చేయబోయే సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా మీద రకరకాల కథనాలైతే వెలువడుతున్నాయి.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి అనే దానిమీద పలు రకాల రూమర్లైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు జుట్టు గురించి పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో ముఖ్యంగా మహేష్ బాబు వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అయినప్పుడు తన అక్క అయిన మంజుల తన హెయిర్ ని టచ్ చేయబోయింది. ఇక దాంతో మహేష్ బాబు వెనక్కి జరిగాడు. ఇక ఇది చూసిన చాలామంది మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ అతనికి వ్యతిరేకంగా కామెంట్లైతే చేస్తున్నారు. మహేష్ బాబు జుట్టు ఊడిపోతుందనే ఉద్దేశ్యం తోనే ఆయన అలా దూరం జరిగినట్టుగా మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మహేష్ బాబుకు కు ఉన్నది విగ్గు అని కొంతమంది అంటుంటే అది ఒరిజినల్ హెయిర్ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. మరి ఇలాంటి క్రమం లోనే ఆయన కూతురు అయిన సితార కూడా ఈ విషయం మీద స్పందిస్తూ “ఆరోజు ఫంక్షన్ లో మా అత్త మా నాన్న హెయిర్ మీద చేయి వేయడంతో నాన్న ప్లీజ్ నా హెయిర్ మీద మాత్రం చేయి వేయకు” అని మా అత్తకి చెప్పాడని ఇక సందర్భం లో తెలియజేసింది.

నాన్నకి హెయిర్ అంటే చాలా ఇష్టం హెయిర్ మీద ఎవరైనా టచ్ చేస్తే ఆయన అసలు తట్టుకోలేడని చెప్పింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది మహేష్ బాబు పెట్టుకునేది విగ్గు కాబట్టి హెర్ మీద ఎవరైనా చేయివేస్తే అది ఊడిపోతుందనే నేపథ్యం లోనే దాని మీద ఎవ్వరిని చేయి వేయనియాడని కూడా కామెంట్లు చేస్తూన్నారు…