Shikhar Dhawan: టీమిండియా వెటరన్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. ఆయన కెరీర్ లైఫే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలిసిందే. ఆయన వివాహం, విడాకుల వరకు తెరిచిన పుస్తకరమే. అయితే గతంలో ఒక స్టార్ ఉమెన్ క్రికెటర్ తో ధావన్ ను కలుపుకొని కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఆమె ఎవరో కాదు టీమిండియా ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్.
మిథాలీ రాజ్, శిఖర్ ధావన్ మధ్య ఏదో ట్రాక్ నడుస్తుందని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని నెలల క్రితం వరకు పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. ఈ పుకారుపై తెలియని క్రికెట్ అభిమాని లేడంటే సందేహం లేదు. తాజాగా, ఈ పుకార్లపై శిఖర్ ధావన్ నోరు మెదిపారు. తన స్నేహితుల ద్వారా ఈ పుకార్లు తన చెవి వరకు వచ్చాయని తెలిపారు. జియో సినిమాకు సంబంధించి షో ‘ధావన్ కరేంగే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను మిథాలీ రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో విపరీతమైన పుకార్లు వచ్చాయి.. నేనూ విన్నాను..’ అని ధావన్ అక్కడి వరకే చెప్పాడు. కానీ ఇవి పుకార్లా.. లేక నిజమా? ఆ పుకార్లకు కారణం ఏంటనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ధావన్ ఈ పుకార్లకు కేవలం కామా మాత్రమే పెట్టినట్లు అర్థం చేసుకోవచ్చా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బంధం పటాపంచలు
తనకంటే వయస్సులో పదేళ్లు పెద్దది, వివాహం జరిగి అప్పటికే ఇద్ధరు పిల్లలున్న ఆయేషా ముఖర్జీని శిఖర్ ధావన్ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. 2012లో శిఖర్ ధావన్ కు ఆయేషా ముఖర్జీకి వివాహం జరుగగా.. సరిగ్గా 11 ఏళ్ల తర్వాత వీరు విడిపోయారు. పరస్పర అంగీకారంతో 2023లో ఈ జంట డైవర్స్ తీసుకుంది. ఈ జంటకు ఒక కుమారుడు జోరావర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ ఒంటరిగానే ఉంటున్నారు.
పర్సనల్ లైఫ్ పణంగా..
టీమిండియా స్టార్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ కు ఇప్పటి వరకు వివాహం కాలేదు. అయితే అందుకు కారణం లవ్ ట్రాకో లేదంటే మరోటి కాదు. కెరీర్ పై ఉన్న ఇంట్రస్ట్ మాత్రమే. మిథాలీకి 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు సంబంధాలు వెతకడం ప్రారంభించారు. అయితే, కెరీర్ లోని క్రికెట్‌తో బిజీగా ఉండడం వల్ల ఆ సంబంధాలను రిజక్ట్ చేసింది. 27-30 ఏళ్లు వచ్చే సరికి పెళ్లిపై ఇంట్రస్ట్ తగ్గి పెళ్లి గురించి ఆలోచనే మానేసిందట. అయితే, పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో వచ్చిన సంబంధాల్లో ఎక్కువ మంది క్రికెట్ ను వదులుకోమని చెప్పారట. దీంతో వారిని పక్కకు జరుపుతూ వెళ్లిందట. ఇలా మిథాలీ కెరీర్ లైఫ్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని త్యాగం చేసేసింది. అలా అని బాధపడడం లేదట.. సింగిల్‌గా చాలా హ్యాపీగా ఉన్నానంటోంది.