Aarambham Movie Review: ఆరంభం ఫుల్ మూవీ రివ్యూ

Aarambham Movie Review : డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన 'ఆరంభం ' సినిమా వచ్చింది. అయితే రీసెంట్ గా ఓటిటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటివీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది మెప్పించిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : May 27, 2024 11:51 am

Aarambham Review

Follow us on

Aarambham Movie Review: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి సినిమాలు సక్సెస్ సాధిస్తాయో చెప్పడం చాలా కష్టం..ఇక కొన్ని సందర్భాల్లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో చాలావరకు ఆ సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే ఒక డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ‘ఆరంభం ‘ సినిమా వచ్చింది. అయితే రీసెంట్ గా ఓటిటీ(OTT) ప్లాట్ ఫామ్ అయిన ఈటివీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది మెప్పించిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక గ్రామానికి చెందిన మిగిల్ (మోహన్ భగత్) ఒక హత్య కేసు లో జైల్ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే జీవితాన్ని సక్రమంగానే అనుభవిస్తున్న ఆయన ఒకరోజు జైల్ నుంచి మాయమైపోతాడు. వేసిన గేట్లు వేసినట్టుగానే ఉన్నాయి. అలాగే గోడలు కూడా అదే మాదిరిగా ఈ మాత్రం పగల కుండా ఉన్నాయి. మరి అతను జైలు నుంచి ఎలా మాయమైపోయాడు అనేది పోలీసులకు అర్థం కాదు. ఇక ఈ విషయం బయటకి లీక్ అయితే మన పరువు పోతుంది అన్న ఉద్దేశ్యంతో పోలీసులు ఒక డిటెక్టివ్ అయినా చేతన్ (రవీంద్ర విజయ్) యొక్క సహాయం తీసుకొని వారిని ఎలాగైనా సరే పట్టుకోవాలని అనుకుంటారు. ఇక ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ లో సినిమా అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలోనే మిగిల్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అసలు అది ఎలా పాజిబుల్ అయింది అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంతకుముందు టైమ్ లూప్ కాన్సెప్ట్ లో వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా తెరకెక్కింది.అయితే డెజావు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా జాగ్రత్తగా తీశారు. ఇక ఇలాంటి సినిమాల్లో ఏ మాత్రం చిన్న మిస్టెక్ జరిగినా కూడా ఈ సినిమా మొత్తానికి ప్రాబ్లం అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అంటే దర్శకుడు అజయ్ నాగ్ ఈ విషయంలో కొంతవరకు చాలా చక్కగా వ్యవహరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక నిజానికి ఇది చాలా కొత్త కాన్సెప్ట్ అనేది అంత ఆషామాసి వ్యవహారం అయితే కాదు.

నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయాలనే ఆలోచన దర్శకుడికి రావడం కూడా మంచి విషయమే.. ఇక మొత్తానికైతే ఈ సినిమాను పర్ఫెక్ట్ గా తెరకెక్కించడం లో ఆయన కొంత వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ అఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం స్టోరీ అనేది చాలా ఫాస్ట్ గా నడుస్తూ ఉంటుంది. ఇక దీంట్లో స్లో నరేషన్ తో ఉండడం వల్ల ప్రేక్షకులకు కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ సినిమా చూడాలంటే మాత్రం మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కాకుండా చాలా పేషెన్సీ తో ఈ సినిమా గనక చూసినట్టయితే చివరి వరకు ఈ సినిమా ఆపకుండా చూస్తే వాళ్ళు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక కొన్ని సీన్లలో అయితే దర్శకుడు రాసుకున్న ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా బయటకు వచ్చిందనే చెప్పాలి… అయితే ఈ సినిమాలో డిటెక్టివ్ గా చేసిన చేతన్ పాత్ర ఎంగేజింగ్ గా అనిపించినప్పటికీ ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ అంత అద్భుతంగా లేదనిపిస్తుంది.

ఆర్టిస్ట్ పర్ఫామెన్స్…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిల్ లీడ్ పోషించిన మోహన్ భగత్ సుప్రీత్ నారాయణ్ అలాగే చాలావరకు అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాతో వీళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే వచ్చింది. కథలో ఎలాంటి వేరియేషన్స్ అయితే కావాలో అలాంటి వేరియేషన్స్ లోకి వాళ్లని వాళ్లు మార్చుకొని ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారనే చెప్పాలి. వీళ్ళ పర్ఫామెన్స్ లో ఒక మెచ్యూరిటీ అయితే కనిపించింది. ఇక మిగితా పాత్రల్లో నటించిన వారు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సిన్జిత్ యర్రంమిల్లి అందించిన మ్యూజిక్ గాని సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో కొన్ని కోర్ ఎమోషన్ సీన్స్ ని అద్భుతంగా పండించడంలో మ్యూజిక్ చాలా చక్కటి పాత్ర పోషించింది. చాలా వరకు ఇక కథ లో కన్ప్లిక్ట్ కొత్తగా ఉండటం వల్ల మ్యూజిక్ ఇవ్వడానికి కూడా వీళ్లకు చాలా ఫ్రెష్ ఫీల్ అయితే దొరికింది. అందువల్లే సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక డిఫరెంట్ ప్లాట్ లో ముందుకు కదిలింది… ఇక విజువల్ గా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారనే చెప్పాలి. ఇక ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ అయిన దేవ్ దీప్ గాంధీ అందించిన విజువల్స్ చాలా హైలెట్ గా నిలిచాయి…ఇక మొత్తానికైతే ఈ సినిమా కి చాలా మంచి విజువల్స్ ను అందించి టాప్ లెవల్లో నిలిపారు…

ప్లస్ పాయింట్స్

కథ
కొన్ని ట్విస్ట్ లు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే లో ఇంకా కొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది…
కొన్ని చోట్ల సాగదితా గా అనిపించింది…

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్

డిఫరెంట్ సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి ఫీల్ ఇస్తుంది…