https://oktelugu.com/

Renu Desai: నా భర్త నాక్కావాలి.. పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. వైరల్ వీడియో…

జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ అతని మీద చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాల మీద కూడా రేణు దేశాయ్ రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు. అకిరానందన్ కి గాని వాళ్ళ నాన్న అయిన పవన్ కళ్యాణ్ కి గాని అలా పిలిపించుకోవడం ఇష్టం ఉండదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 21, 2024 / 06:11 PM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా మారడమే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇలాంటి పవన్ కళ్యాణ్ రెండో భార్య అయిన రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల మీద కూడా సీరియస్ అవుతుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా నందన్ ను ఉద్దేశిస్తూ మా అన్న పవన్ కళ్యాణ్ లాగే అకిరా నందన్ కూడా చాలా పెద్ద హీరో అవుతాడు.

    జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ అతని మీద చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాల మీద కూడా రేణు దేశాయ్ రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు. అకిరానందన్ కి గాని వాళ్ళ నాన్న అయిన పవన్ కళ్యాణ్ కి గాని అలా పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి అకిరానందన్ ను పవన్ కళ్యాణ్ తో పోల్చకండి. అకీరా కి సెపరేట్ ఐడెంటిటీ ఉండనివ్వండి అంటూ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద చాలా వరకు ఫైర్ అయ్యారు. ఇక రీసెంట్ గా ఆమె ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు…

    ఇక ఈ వీడియోలో తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ ను ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు. నా ఈ ఐ ఫోన్ లో భోగిమంట స్లో మోషన్ లో చిత్రీకరించాను. డిసెంబర్ నుంచి ట్రిప్ చేస్తున్నాను. నేను ఇంకా నా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదని మర్చిపోయాను.

    ఇక నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి లేదా నేను ఇప్పటికే అతన్ని కోల్పోతున్నానని మీరు భావించినందున నేను ఈ పోస్టుని ఎలా ఉంచాను అనే దాని పైన అసభ్యకరమైన కామెంట్లు గాని మీ అభిప్రాయాలను గాని వ్యక్తం చేస్తే డిలీట్ చేస్తా లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తా… అంటూ ఆమె చాలా ఘాటుగా రాసుకొచ్చారు…గత కొద్ది రోజుల నుంచి ఆమె కామ్ గా ఉంటున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇన్ స్టా లో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏదో ఒక రకంగా కౌంటర్లను ఇచ్చారు…