Viral Video : రీల్స్ కోసం వేగంగా వస్తున్న బస్సు కింద పడ్డ యువకుడు.. తర్వాత ఏమైందంటే?.. వైరల్ వీడియో..

Reels తాజాగా, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున యూసుఫ్ గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ఎదుటకు బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఒక యువకుడు ఒక్కసారిగా వచ్చాడు.

Written By: NARESH, Updated On : June 21, 2024 9:08 pm

A young man fell under a speeding bus for reels

Follow us on

Viral Video : సోషల్ మీడియా విస్తృతమైనప్పటి నుంచి టీనేజర్స్, యూత్ తో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏది చేయాలో.. ఏది చేయద్దో.. స్పృహ ఉండడం లేదు. ఒకడు కరెంటు తీగలు ముట్టుకుంటానంటాడు.. మరొకడు విషపు పాములను ముద్దు పెట్టుకుంటా అంటాడు. ఇంకొకడు బిల్డింగ్ పై నుంచి దూకుతానని అంటాడు. ఇలా ప్రతీ ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నారు. కేవలం 30 సెకండ్ల రీల్స్ కోసం ప్రణాన్ని విలువైన యవ్వనాన్ని పనంగా పెడుతున్నారు.

మొన్నటికి మొన్న పుణెలో రీల్ చేసేందుకు అతిపెద్ద భవనం పై నుంచి ఒక లేడీ స్టంట్ చేసింది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ ఒక వేళ పైన పట్టుకునే వ్యక్తి చేయి జారి ఉంటే మాత్రం ఇప్పటికి పాడె లేచేది. మరి వీటితో ఏం లాభం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం లైకుల కోసమే ఇదంతా. దీనితో ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు. టీచర్లు, పెద్దలు కొన్ని చదువుకునే వీడియోలు పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. సోషల్ మీడియాను ఇలా వాడుకుంటే పేదలకు సైతం చదువు అందుతుందని చెప్తున్నారు. కానీ యూత్ మాత్రం ఇలాంటి అర్థం పర్థం లేదని పనులు చేస్తూ టైం వేస్ట్ చేస్తుంది.

తాజాగా, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున యూసుఫ్ గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ఎదుటకు బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఒక యువకుడు ఒక్కసారిగా వచ్చాడు. పాపం డ్రైవర్ ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డాడు. కానీ బస్సు ఆ సమయంలో బ్రేకులు వేయలేకపోయాడు. వెంటనే ఆ యువకుడు బస్సు కింద మధ్యలో పడుకున్నాడు. బస్సు డ్రైవర్ యువకుడికి ఏమీ కావద్దని ఎటు వైపునకు మలుపు తీసుకోకుండా నేరుగా పోనిచ్చాడు. దీంతో సదరు యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. తాపీగా లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇది వైరల్ కాగా.. యువకుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒకరికి కఠిన శిక్ష వేస్తే ఇలాంటి వారు మారుతారని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేవలం లైకుల కోసం చేస్తున్న ఇలాంటి పిచ్చి పనులు విస్మయానికి గురి చేస్తుండగా.. యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.