Rana Daggubati New Movie Updates: మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు రానా దగ్గుబాటి(Rana Daggubati). బాహుబలి సిరీస్ తో ఈయనకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది అనుకుంటే పొరపాటే. బాహుబలి కి ముందే ఆయన కొన్ని సినిమాలు హిందీ లో చేసి అక్కడి ఆడియన్స్ లో మంచి గుర్తింపు ని తెచ్చుకున్నాడు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత రానా కచ్చితంగా భారీ సినిమాలు చేసి స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోతాడని అంతా ఆశించారు. ఈ సిరీస్ తర్వాత ఆయన చేసిన ‘నేనే రాజు ..నేను మంత్రి’ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో ఇక రానా టైం మొదలైంది అని అంతా అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించేసాద్. హీరో గా కంటే ముఖ్య పాత్రల్లో నటించడానికే ఎక్కువ మొగ్గు చూపించాడు.
‘నేనే రాజు ..నేనే మంత్రి’ చిత్రం తర్వాత రానా డబ్బుబాటి హీరో గా నటించిన సినిమాలు ‘అరణ్య ‘, ‘విరాట పర్వం’ మాత్రమే. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చాయో , ఎప్పుడు వెళ్ళాయో కూడా జనాలకు తెలియదు. ఎక్కువగా ఆయన క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకు గొప్పగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘భీమ్లా నాయక్’ మాత్రమే. ఇందులో పవన్ కళ్యాణ్ తో ఢీ అంటే ఢీ అనేలా అద్భుతంగా నటించాడు. అయితే దగ్గుబాటి అభిమానుల్లో ఎప్పటి నుండో ఒక నిరుత్సాహం ఉంది. రానా మంచి నటుడు, అందగాడు, ఎందుకు ఇలా క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తున్నాడు ?, ఆయనకు ఉన్న కటౌట్ కి పెద్ద యాక్షన్ హీరో అవ్వొచ్చు , ఎందుకు ఆ వైపుగా అడుగులు వేయడం లేదు అనే బాధ వారిలో అలాగే ఉండిపోయింది.
Also Read: ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న ‘ధురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
అయితే ఇప్పుడు అభిమానుల కోసం ఆయన ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రానా హీరో గా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో త్వరలోనే ఒక చిత్రం తెరకెక్కబోతుంది. రీసెంట్ గానే రానా ని కలిసి బోయపాటి శ్రీను ఒక పవర్ ఫుల్ స్టోరీ ని కూడా వినిపించాడు. ఇది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రం ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ లో తెరకెక్కనుంది. రానా లాంటి భారీ కటౌట్ తో బోయపాటి శ్రీను మార్క్ ఫైట్స్ ని ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో ?, ఈ కాంబినేషన్ లో సరైన సినిమా పడితే మాత్రం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి. ఈ చిత్రం తర్వాత రానా ఇకపై హీరో గానే సినిమాలు చేసే అవకాశం ఉంది.