Ram Charan new business: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు… రెండో సినిమాగా చేసిన ‘మగధీర’ మూవీతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. తండ్రికి తగ్గ తనయుడి గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలు చేస్తూనే బిజినెస్ రంగా వైపు కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక స్టూడియోను నిర్మించాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అక్కినేని, రామానాయుడు ఫ్యామిలీలకి సైతం స్టూడియోలైతే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ సైతం అల్లు స్టూడియో అంటూ ఒక స్టూడియోను నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం ఒక స్టూడియోను నిర్మించి దానిని రెంట్ కి ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా రంగంలో బిజినెస్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
కాబట్టి సినిమానే బిజినెస్ గా మార్చి రామ్ చరణ్ భారీ బిజినెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ బిజినెస్ మీద ఆయన భారీగా డబ్బులు కూడా వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Also Read: చిరంజీవి విశ్వంభర సమ్మర్ లో కూడా రానట్టేనా..?
రామ్ చరణ్ తో పాటు మరి కొంత మంది పార్ట్నర్స్ కూడా ఉన్నారట. మరి వాళ్ళు ఎవరు అనే విషయాలను తొందర్లోనే తెలియజేయబోతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇటు సినిమాలు చేస్తూ, అటు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ రెండు రకాలుగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మరోసారి మెగా ఫ్యామిలీ సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా వచ్చే నెల 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తాడు అంటూ మెగా అభిమానులు సైతం కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…
