Site icon OkTelugu

Rajamouli: రాజమౌళి చేసిన సినిమాల్లో తనకే నచ్చని సినిమా ఒకటుంది…ఆ మూవీ ఏంటంటే..?

SS Rajamouli Mahabharata

SS Rajamouli Mahabharata

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేంటంటే వాళ్ళు చేసిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు టాప్ పొజిషన్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోల విషయం పక్కన పెడితే ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని గౌరవాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వారిలో రాజమౌళి ఒకరు. ఆయన చేసినవి 12 సినిమాలే అయిన అందులో 12 సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇక ఏది ఏమైనా రాజమౌళి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే చాలా మందికి రోల్ మోడల్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాల్లో ఆయనకి నచ్చని ఒక సినిమా ఉందని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు… జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి రాజమౌళి చేసిన యమదొంగ సినిమా సక్సెస్ సాధించినప్పటికి అది వర్క్ పరంగా చూసుకున్న కథ పరంగా చూసుకున్న రాజమౌళికి అంత సంతృప్తిని ఇవ్వలేదట.

మిగిలిన అన్ని సినిమాల విషయంలో ఆయన పూర్తి క్లారిటితో ఉన్నప్పటికి ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రం ఆయనకు తెలియని ఏదో ఒక సంతృప్తి ఉందని పలు సందర్భాల్లో తెలియజేశాడు…ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి మీద కొంతవరకు సీరియస్ అవుతున్నారు.

ప్రతిసారి రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో రాజమౌళి మీద ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడితో రాజమౌళి నాలుగు సినిమాలు చేశాడు.

ఆ నాలుగు సినిమాల వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడనే విషయం మనందరికి తెలిసిందే. వాటిని మినహాయిస్తే జూనియర్ ఎన్టీఆర్ సాధించిన విజయాలు చాలా తక్కువే కాబట్టి రాజమౌళి అలాంటి కామెంట్లు చేసిన వాటిలో తప్పు ఉండదని మరి కొంతమంది రాజమౌళిని సమర్థిస్తున్నారు…

Exit mobile version