https://oktelugu.com/

ముహుర్తం ఫిక్స్.. మహేష్, పవన్ రికార్డులను బ్రేక్ చేయనున్న ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ‘బాహుబలి’ అమాంతం పెరిగిపోయింది. ‘బాహుబలి-1’.. ‘బాహుబలి-2’ సీరిసులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజై సరికొత్త రికార్డులను సృష్టించారు. ఈ మూవీ విడుదలైన ప్రతీచోట భారీ విజయం సాధించడంతో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయారు. Also Read: పిల్లనిచ్చిన మామపై చిరంజీవి ప్రేమ ప్రభాస్ సైతం ‘బాహుబలి’ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ వెళుతున్నారు. వరుసగా ప్యాన్ ఇండియా మూవీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 11:02 AM IST

    Prabhas

    Follow us on

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ‘బాహుబలి’ అమాంతం పెరిగిపోయింది. ‘బాహుబలి-1’.. ‘బాహుబలి-2’ సీరిసులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజై సరికొత్త రికార్డులను సృష్టించారు. ఈ మూవీ విడుదలైన ప్రతీచోట భారీ విజయం సాధించడంతో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయారు.

    Also Read: పిల్లనిచ్చిన మామపై చిరంజీవి ప్రేమ

    ప్రభాస్ సైతం ‘బాహుబలి’ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ వెళుతున్నారు. వరుసగా ప్యాన్ ఇండియా మూవీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ ఉత్తరాదిన కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో బాలీవుడ్లోనూ ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న సినిమాలే కావడం విశేషం.

    సోషల్ మీడియాలోనూ ప్రభాస్ ఫాలోవర్స్ మిలియన్లలో ఉన్నారు. ఫేక్ బుక్ లో 20మిలియన్లు.. ఇన్ స్ట్రాలో 5.4మిలియన్లు ఉన్నారు. ప్రభాస్ ట్వీటర్ ఖాతా లేకపోయినా నిత్యం డార్లింగ్ సినిమాలపై చర్చ జరుగుతూ ఉంటుంది. దక్షిణాదిన సోషల్ మీడియా రికార్డులు.. ముఖ్యంగా ట్వీటర్ రికార్డుల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, విజయ్, అజిత్ వంటి పేర్లపేనే ఉన్నాయి.

    ఇప్పటివరకు వీరిపై ఉన్న రికార్డులను బ్రేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. మహేష్ బాబు, పవన్ పుట్టిన రోజులకు ముందుగానే అభిమానులను పనిగట్టుకొని ట్వీటర్లో #ట్యాగులతో రికార్డులు సృష్టించారు. 40మిలియన్లు.. 50మిలియన్లు.. 60మిలియన్ల అంటూ కొత్త రికార్డులు సృష్టించారు.

    ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన పేరుతో 65మిలియన్ల ట్వీట్లు చేసి వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇక ఈ రికార్డు త్వరలోనే బ్రేక్ కాబోతుంది. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అతని సినిమా అప్డేట్స్ అన్ని ఆరోజునే విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. దీంతో ఆరోజు ప్రభాస్ నామస్మరణ మార్మోమోగడం ఖాయంగా కన్పిస్తోంది.

    Also Read: ఇంట్రస్టింగ్: పవన్ సినిమా.. అసలు కథ వినలేదా?

    రాధేశ్యామ్.. ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ తో ఆరోజు సోషల్ మీడియా షేక్ అవుతుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న సోషల్ మీడియా.. ట్వీటర్లలో ఉన్న పాత రికార్డులు కనుమరుగు అవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు.