ట్రంప్ సన్నిహితుల్లో ఆందోళన.. ఎందుకంటే?

కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా ఇదే పేరు.. చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను బెంబెలెత్తిస్తోంది. పేద.. ధనిక.. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అందరిపై కరోనా ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతుంది. ప్రపంచంలోనే కరోనా కేసుల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. Also Read: అహింసతో ఆంగ్లేయులను తరిమిన ‘మహాత్ముడు’ కరోనా సమయంలోనూ అమెరికాలో ఎన్నికల వేడిరాజుకుంది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. దీంతో […]

Written By: NARESH, Updated On : October 2, 2020 11:58 am
Follow us on


కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా ఇదే పేరు.. చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను బెంబెలెత్తిస్తోంది. పేద.. ధనిక.. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అందరిపై కరోనా ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతుంది. ప్రపంచంలోనే కరోనా కేసుల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండటం గమనార్హం.

Also Read: అహింసతో ఆంగ్లేయులను తరిమిన ‘మహాత్ముడు’

కరోనా సమయంలోనూ అమెరికాలో ఎన్నికల వేడిరాజుకుంది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ట్రంప్.. జో బిడైన్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఇటీవల వీరిద్దరి మధ్య తొలి ముఖాముఖి జరిగింది. ఇందులో కరోనాపై చర్చ జరుగగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో చేయడంలో తమ ప్రభుత్వం శాయశక్తులా పని చేసిందని చెప్పారు. అదేవిధంగా సుప్రీం కోర్టు జడ్జిల నియామకం.. ఒబామా హెల్త్ కేర్ పాలసీపై వాడివాడీ చర్చ నడిచింది.

ఇక తాజాగా ట్రంప్ సలహాదారుణి అయిన హుప్ హిక్సు కరోనా బారినపడింది. దీంతో వైట్ హౌజ్ వర్గాల్లో.. ట్రంప్ సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంపుతో ఆమె ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అతడి భార్య మెలానియా ట్రంప్ లు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు.

Also Read: ‘భారత్’కు చేరుకున్న మోదీ వీవీఐపీ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..?

దీంతో ట్రంప్ దంపతులు కరోనా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్ష ఫలితాన్ని బట్టి తాను క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ‘చిన్న విరామం కూడా తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తున్న హోప్ హిక్సుకు కరోనా పాజిటివ్ అని తేలింది.. భయంకరమైనది.. నేను.. నా భార్య మెలానియాలు కొవిడ్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం.. ఈలోగా, మేం క్వారంటైన్  ప్రక్రియ ప్రారంభిస్తున్నాం’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు.

ఒకవేళ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ వస్తే మాత్రం అతడి ఎన్నికల ప్రచారానికి కొద్దిరోజులు బ్రేక్ పడేలా కన్పిస్తోంది. దీంతో ట్రంప్ కరోనా ఫలితంపై అందరిలో టెన్షన్ నెలకొంది.