Akira Nandan: పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా నందన్ ఎంట్రీ ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. అకీరా టీనేజ్ దాటేశాడు. హీరోగా మారేందుకు పర్ఫెక్ట్ ఏజ్ లో ఉన్నాడు. ఇక అందం, ఆహార్యంలో తండ్రికి ఏమాత్రం తగ్గడు. ఇప్పటివరకు మెగా హీరోల్లో వరుణ్ తేజ్ అత్యంత పొడగరి. ఆయన్ని కూడా మించేశాడు అకీరా. ఈ జూనియర్ పవర్ స్టార్ ఎత్తు ఆరున్నర అడుగులకు పైమాటే. తండ్రి వలె మల్టీ టాలెంటెడ్ కూడాను.
మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ వంటి కళలు అభ్యసించాడు. పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు అకీరా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునేది మాత్రం అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటాలని ఆశిస్తున్నారు. అకీరా ఎంట్రీ ఇస్తే చాలు నెత్తిన పెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. కాగా అకీరా అందుకు కసరత్తు మొదలుపెట్టాడేమో అనే భావన కలుగుతుంది.
అకీరా నందన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో అకీరా నందన్ యుద్ధ విద్యలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అకీరా నందన్ కర్రసాము చేస్తున్న వీడియోను రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. నా సమురాయ్ బేబీ అంటూ ఆ వీడియోకి కామెంట్ జోడించింది.
ఇక అకీరా కర్రసాము చేస్తున్న విధానం చూస్తుంటే యుద్ధ విద్యల్లో తండ్రిని మించిపోయేలా ఉన్నాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ అనే పిచ్చి. ఆయన కొన్నాళ్ళు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తన సినిమాల్లో కొన్ని ఫైట్ సీన్స్ స్వయంగా కంపోజ్ చేశాడు పవన్ కళ్యాణ్. మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న మక్కువ కొడుకు అకీరాకు కూడా అబ్బింది. ఇక అకీరా ఎంట్రీ పై రేణు దేశాయ్ ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడింది. తన అభిరుచి మేరకే వదిలేస్తా అని ఆమె అన్నారు.