Rajamouli: పాన్ వరల్డ్ గేట్లు ఓపెన్ చేస్తున్న రాజమౌళి… హీరోలా పారితోషికాలు భారీగా పెరగనున్నాయా..?

రాజమౌళి ఈ సినిమాతో సక్సెస్ సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా చేస్తాడా? అక్కడి దర్శకులతో పోటీపడి మరి నిలబడతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Written By: Gopi, Updated On : May 11, 2024 10:36 am

Rajamouli

Follow us on

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి.. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక దాంతో ఆయన యమదొంగ, మగధీర, ఈగ లాంటి భారీ గ్రాఫికల్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత బాహుబలితో ఒక్కసారిగా విజువల్ వండర్ ని పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

ఇక ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి తెలుగు సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాతో తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ గేట్లను ఓపెన్ చేస్తున్నాడు. కాబట్టి ఇక మీదట తెలుగు సినిమాలు అన్నీ కూడా వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో మన మేకర్స్ అయితే ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మన హీరోలు, వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకెన్ని కోట్లు తీసుకుంటారో అనే ఆందోళనలోనే ప్రొడ్యూసర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి దీనికి అనుకూలంగానే మన హీరోల రెమ్యూనరేషన్లు కూడా భారీగా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరి రాజమౌళి ఈ సినిమాతో సక్సెస్ సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా చేస్తాడా? అక్కడి దర్శకులతో పోటీపడి మరి నిలబడతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక రాజమౌళి పాన్ వరల్డ్ లో ఉన్న దర్శకులందరిని మెప్పిస్తాడా? మన సినిమాను వరల్డ్ సినిమా ప్రేక్షకులందరికీ పరిచయం చేసి మన సినిమాను ప్రపంచ పటంపై నిలుపుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ అయింది. ఇక తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాడు…