Tollywood Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొదటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలకి పెద్దపెట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడనే కాదు. 1990వ సంవత్సరం నుంచి కూడా ఎక్కువగా కమర్షియల్ సినిమాలే వస్తున్నాయి. ప్రేక్షకులు వాటిని చూస్తూ వాటినే ఎక్కువగా ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ఆ రకంగానే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు మొత్తం కమర్షియల్ సినిమాలు చేసి స్టార్ హీరోలుగా ఎదిగారు. ఒక రకంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ లాంటి నటుడు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను అందుకున్నాడు. అలాగే అటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టి, మోహన్ లాల్ కూడా కథను బేస్ చేసుకొని సినిమాలను చేసి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. కానీ మన హీరోలు మాత్రమే కమర్షియల్ సినిమాలనే చేస్తున్నారు. కన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ను ఎందుకు చేయలేకపోయారు. ఇక గత కొన్ని సంవత్సరాల వరకు అదే ఫార్మాట్ ని కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ కి లేని ఒక చెత్త రికార్డ్ అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది. గత సంవత్సరం కిందటి వరకు మన ఇండస్ట్రీ కి ఒక్క ‘నేషనల్ అవార్డు’ కూడా రాలేదు. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి ‘నేషనల్ అవార్డు’ వచ్చినప్పటికీ తెలుగులో మొట్టమొదటిసారి నేషనల్ అవార్డుని దక్కించుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలవడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.
ఇక మిగతా హీరోలకి ఎందుకు నేషనల్ అవార్డులు రావడం లేదు అంటూ చాలా రోజులుగా సినీ మేధావులు సైతం ఈ విషయం మీద చాలా డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. అయితే మనవాళ్లు ఇప్పుడిప్పుడే కథల పరంగా చాలా బాగా ఆలోచిస్తూ ఇమేజ్ ను దాటుకొని మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. కాబట్టి ఇకమీదట మన సినిమా ఇండస్ట్రీ నేషనల్ అవార్డు తో పాటు ఆస్కార్ అవార్డు లను కూడా సాధించే రేంజ్ కి వెళ్ళిపోతుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా కథలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇలాంటి ఒక గొప్ప రోజు రావడం అనేది మనందరి అదృష్టమనే చెప్పుకోవాలి.
ఇక మొత్తానికైతే కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలే ఎక్కువగా రావడంతో మనల్ని మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కన్సిడర్ చేయలేక పోయారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ స్థాయి అనేది చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు మన హీరోల టైమ్ మొదలైందనే చెప్పాలి. ఇక మీదట కూడా మన ఇండస్ట్రీకి చాలా నేషనల్ అవార్డులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇంతకుముందు ఎన్ని అవార్డులైతే మనం మిస్ చేసుకున్నామో వాటిని వడ్డీతో సహా వసూలు చేసే సమయం అయితే వచ్చిందంటూ పలువురు సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
ఇక పర భాష కాదు మన భాష నటులు కూడా గొప్ప నటులే అని మనం గర్వంగా చెప్పుకునే రోజులు వస్తున్నాయి. మన హీరోల నటనకు కొలమానంగా ఈ అవార్డులను కూడా తీసుకొచ్చి మన నటులు వాళ్ల సత్తా ఏంటో చూపించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా స్థాయిని పెంచిన మన హీరోలు అవార్డుల విషయంలో వెనుకబడి ఉన్నారు. మరి ఆ అవార్డులను కూడా దక్కించుకొని అందరికంటే మనమే టాప్ పొజిషన్ లో ఉన్నామని ప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…