Meesaala Pilla Song Promo: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీయగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేసి వాళ్ల వింటేజ్ స్టైల్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు పెను సంచలనాలను క్రియేట్ చేసిన కొంతమంది క్రేజీ టెక్నీషియన్స్ ను తన సినిమాలో భాగం చేసి వాళ్లతో సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అలాగే మ్యూజికల్ గా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న రమణ గోగులతో ‘గోదారి గట్టు మీద చందమామవే’ అనే పాటను పాడించి ఆ పాటను చాట్ బస్టర్ గా నిలిపాడు… మరోసారి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉదిత్ నారాయణ ను సైతం చిరంజీవితో చేస్తున్న ‘ మన శంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నాడు’ సినిమాలో భాగం చేశాడు. ఆయన వాయిస్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. 90స్ లో, 2000 సంవత్సరాల్లో అతను పాడిన అన్ని పాటలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ముఖ్యంగా చిరంజీవికి చూడాలని ఉంది సినిమాలోని ‘ రామ చిలకమ్మ’, కైకలూరు కన్నే పిల్ల, వాన వాన వెన్నెల వాన అనే పాటలు అతని స్వరం నుంచే వచ్చాయి. ఈ పాటలన్నీ సూపర్ సక్సెస్ అవ్వడంతో అతనికి చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. అలాగే వీళ్లిద్దరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే పేరు కూడా వచ్చింది.
చిరంజీవి కి ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించడంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న సింగర్లలో ఉధిత్ నారాయణ కూడా ఒకరు కావడ విశేషం… ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే సాంగ్ ను దసర కానుకగా రిలీజ్ చేశారు.
సాంగ్ అద్భుతంగా ఉండటమే కాకుండా అందులో చిరంజీవి స్టెప్స్ కూడా బాగున్నాయి. ఇక మొత్తం సాంగ్ ని స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రేక్షకులు విజిల్స్ తో ఉర్రూతలింగించాడు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచుతున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన విషయం మనకు తెలిసిందే…
ఆయన ఇప్పుడు చిరంజీవితో కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకొని వరుసగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి లాంటి ముగ్గురు సీనియర్ హీరోలకు సక్సెస్ లను అందించిన ఏకైక డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…మరోసారి సీనియర్ హీరోకి సూపర్ సక్సెస్ ని అందించిన డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…