Bharta Mahasayaluku Vignaapthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ… ఒకప్పుడు వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న ఆయన ప్రస్తుతం ప్లాపులో ఉన్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సన్నాహాలు చేస్తున్నారు… అయితే ఈ సినిమా టైటిల్ మీద గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికి అవేవీ సరైనవి కాదని సినిమా యూనిట్ కరాకండిగా చెప్పేసింది. ఇప్పుడు ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారు అనే దాని మీద కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఒక టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ఈ సినిమా మొత్తం భర్తలకు సంబంధించిన కాన్సెప్ట్ తోనే ఉంటుంది. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ కి ఇలాంటి టైటిల్ అయితే చాలా సాఫీ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి జష్టిఫికేషన్ ఇస్తున్నట్టుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమా చేసినట్టుగా తెలుస్తోంది.
తొందర్లోనే ఈ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి సినిమా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ కమర్షియల్, యాక్షన్ సినిమాలే కావడం విశేషం…కానీ మొదటి సారి ఆయన ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు… ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినీ ఉండబోతోందట…భర్త యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి? భార్య చేతుల్లో భర్త ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనే ఒక పాయింట్ తో ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో వెంకటేష్ చేసిన ‘ఎఫ్2’ సినిమాకి ఈ సినిమాకి కొంచెం దగ్గర పోలికలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్ లాంటి స్టార్ హీరో కూడా ఉన్నాడు. మరి వాళ్ళతో పోటీని తట్టుకునే రవితేజ ఈ సినిమాని ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…